For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: తెలుగోడికి ఛాన్స్.. అయ్యర్ డౌట్! ఆసీస్‌తో తొలి వన్డే ఆడే భారత జట్టు ఇదే!

మొహాలీ: ఆసియాకప్ 2023 టైటిల్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. వన్డే ప్రపంచకప్ ముంగిట పటిష్ట ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా శుక్రవారం జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఈ మూడు వన్డేల సిరీస్‌ ఇరుజట్లకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. మెగా టోర్నీ నేపథ్యంలో తమ బలబలాలు, బలహీనతలను పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు సీనియర్ ఆటగాళ్లను టీమిండియా మేనేజ్‌మెంట్ దూరం పెట్టింది.

India Playing XI vs Australia for 1st ODI: Tilak Varma In and Shreyas Iyer Doubt

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా, స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్‌లకు విశ్రాంతినిచ్చింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్న టీమ్‌మేనేజ్‌మెంట్.. వాషింగ్టన్ సుందర్‌తో పాటు బెంచ్ ఆటగాళ్లందరినీ తొలి రెండు వన్డేలకు ఎంపిక చేసింది.

తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేతో సీనియర్ ఆటగాళ్లంతా తిరిగి రానున్నారు. శుక్రవారం జరిగే తొలి వన్డేలో బరిలోకి దిగే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్లకే ప్రథమ ప్రాధాన్యత లభించనుంది. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గా లేకపోతే మాత్రం రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు. అయ్యర్ ఫిట్‌గా ఉంటే మాత్రం ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో తిలక్ వర్మ ఆడనుండగా.. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు.

India Playing XI vs Australia for 1st ODI: Tilak Varma In and Shreyas Iyer Doubt

ఏడో స్థానంలో రవీంద్ర జడేజా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్ ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ షమీని ఆడించాలనుకుంటే ఠాకూర్ బెంచ్‌కు పరిమితమవుతాడు. పేసర్లుగా మహహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నారు.

భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్/రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు ఎంపికైన భారత జట్టు..:
కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Story first published: Wednesday, September 20, 2023, 13:29 [IST]
Other articles published on Sep 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+