India Playing XI: సూర్యకు నో చాన్స్.. కేఎస్ భరత్ అరంగేట్రం! ఆసీస్‌తో తొలి టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరుస విజయాలు అందుకున్న టీమిండియా.. సంప్రదాయక ఫార్మాట్‌కు సిద్దమైంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అమీతుమీ తేల్చుకోనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించాయి. 10 రోజుల ముందే భారత్‌లో అడుగుపెట్టిన ఆసీస్.. బెంగళూరు సమీపంలోని ఆలూర్ వేదికగా సన్నదమవుతుండగా... టీమిండియా కాన్పూర్ వేదికగా నిర్వహిస్తున్న ప్రాక్టీస్ శిభిరంలో ముమ్మరంగా సాధన చేస్తోంది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలవాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు చాలా ముఖ్యం. మరోవైపు 2004 నుంచి సొంతగడ్డపై భారత్‌ను ఓడించలేకపోతున్న ఆసీస్.. ఈ సారి ఎలాగైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటోంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలి టెస్ట్‌లోనే విజయం సాధిస్తే టీమ్ ఆత్మవిశ్వాసం పెరగనుంది. ఈ క్రమంలోనే ఇరు జట్లు తొలి టెస్ట్‌లోనే విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.

తలనొప్పిగా టీమ్ కాంబినేషన్..
టీమిండియా కాంబినేషన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలకు తలనొప్పిగా మారింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉండటం.. శ్రేయస్ అయ్యర్ గాయంతో తొలి టెస్ట్‌కు దూరమవ్వడంతో జట్టులోకి ఎవర్ని తీసుకోవాలనేదానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రోల్ విషయంలోనూ టీమ్‌మేనేజ్‌మెంట్‌కు క్లారిటీ లేదు. అతన్ని ఓపెనర్‌గా ఆడించాలా? లేకుంటే మిడిలార్డర్‌లో దించాలా? అనేది కూడా తేల్చుకోవాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో కేఎస్ భరత్‌ను ఆడించాలా? అటాకింగ్ గేమ్ ఆడే ఇషాన్ కిసన్‌కు అవకాశం ఇవ్వాలా? అనేదానిపై కూడా టీమ్‌మేనేజ్‌మెంట్‌కు క్లారిటీ లేదు.

కేఎస్ భరత్ అరంగేట్రం..
వికెట్ కీపర్‌గా తెలుగు తేజం కేఎస్ భరత్‌కు తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు గతంలో వృద్దిమాన్ సాహా, రిషభ్ పంత్‌లకు బ్యాకప్ కీపర్‌గా వ్యవహరించిన అనుభవం ఉండటంతో కేఎస్ భరత్ వైపే టీమ్‌మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనుంది. అంతేకాకుండా సుదీర్ఘ ఫార్మాట్ ఆడిన అనుభవం ఇషాన్ కిషన్ లేకపోవడం, ఇటీవల అతను వరుసగా విఫలమవడం భరత్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. రిషభ్ పంత్‌లా అటాకింగ్ బ్యాటింగ్ ఆప్షన్ కావాలనుకుంటే మాత్రం కేఎస్ భరత్‌కు మరోసారి మొండి చెయ్యే ఎదురవ్వనుంది.

ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, రాహుల్?
రోహిత్ శర్మకు జతగా శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశాలున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను వరుస సెంచరీలతో జోరు కనబరుస్తుండటంతో అతనికే ఓపెనర్‌గా అవకాశం ఇవ్వనున్నారు. రెగ్యులర్ ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. ఒకవేళ రాహుల్ ఓపెనర్‌గా వస్తే.. శుభ్‌మన్ గిల్‌ను మిడిలార్డర్‌లో ఆడించనున్నారు. చతేశ్వర్ పుజారా మూడో స్థానంలో ఆడనుండగా.. కోహ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఐదో స్థానంలో రాహుల్ ఆడుతాడు. దాంతో సూర్యకుమార్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. అతను టెస్ట్ అరంగేట్రం కోసం మరికొద్ది రోజులు నిరీక్షించాల్సిందే.

ముగ్గురు స్పిన్నర్లా..?
ఇక టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్‌కు అనుకూలమైన వికెట్‌నే తొలి టెస్ట్‌కు సిద్దం చేయనున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు స్పిన్ ఆల్‌రౌండర్లుగా ఆడటం ఖాయం. అయితే మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మధ్య పోటీ నెలకొంది. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే అక్షర్ జట్టులోకి వస్తాడు. లేదంటే.. కుల్దీప్ యాదవ్‌ను తీసుకుంటారు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఆడనున్నారు. మ్యాచ్ సమయానికి ఎవరైనా ప్రాక్టీస్‌లో గాయపడితే జట్టులో మార్పులు చోటు చేసుకుంటాయి.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(కీపర్)/ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications