Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఓపెనర్‌గా అతనే.. ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా కాంబినేషన్!

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు టీమిండియా సిద్దమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే చెన్నై చేరి అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు శ్రమిస్తున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మెగా టోర్నీని విజయంతో ప్రారంభించాలనే కసితో తొలిపోరుకు సమాయత్తమవుతున్నారు.

స్టార్ ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లోకి రావడం ఇరు జట్లు పేపర్‌పై బలంగా కనిపిస్తున్నాయి. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఇరు జట్ల బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 Ishan Kishan likely to open

ముఖ్యంగా టీమిండియా ఫైనల్ ఎలెవన్ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడటంతో అతను ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం శుభ్‌మన్ గిల్‌ ఇంకా తొలి మ్యాచ్‌కు అందుబాటులోనే ఉన్నాడని, మెడికల్ టీమ్ అతన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని చెప్పాడు. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని, మ్యాచ్ సమయానికి ఫిట్ అవుతాడని ధీమా వ్యక్తం చేశాడు.

డెంగ్యూ బారిన పడితే ప్లేట్ల‌లేట్స్ తగ్గి చాలా నిరసంగా మారుతారు. ఒకవేళ శుభ్‌‌మన్ గిల్ కోలుకున్నా అతనికి తొలి రెండు మ్యాచ్‌లు విశ్రాంతి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పెద్ద టోర్నీ నేపథ్యంలో టీమిండియా.. శుభ్‌మన్ గిల్ విషయంలో రిస్క్ చేయదు. శుభ్‌మన్ గిల్ దూరమైతే.. రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కే ప్రథమ ప్రాధాన్యత దక్కనుంది. సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలనుకుంటే రాహుల్ ఓపెనర్‌గా ఆడాల్సి ఉంటుంది.

విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనుండుగా..రవీంద్ర జడేజా, అశ్విన్ స్పిన్నర్లుగా బరిలోకి దిగనున్నారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టీమిండియా ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. అప్పుడు పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనుండగా.. వారికి హార్దిక్ పాండ్యా సహకారం అందించనున్నాడు. ఇద్దరు స్పిన్నర్లనే ఆడించాలనుకుంటే మాత్రం శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు.

భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

Story first published: Saturday, October 7, 2023, 15:28 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+