India Playing XI: ఆ SRH ప్లేయర్ అరంగేట్రం.. అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే అఫ్గానిస్థాన్‌తో టీమిండియా ఏకైక టెస్ట్ ఆడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ బరిలోకి దిగే భారత టెస్ట్ టీమ్‌ను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యమిచ్చింది.
సాయి సుదర్శన్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్ రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్నారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుండగా.. కేఎల్ రాహుల్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. పేలవ ఫామ్‌తో రిషభ్ పంత్ తన వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.

SRH ప్లేయర్ అరంగేట్రం..
ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగనుండగా.. వాషింగ్టన్ సుందర్, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ హర్ష్‌దూబేకు ఇది అరంగేట్ర మ్యాచ్. దేవదత్ పడిక్కల్, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.
అఫ్గానిస్థాన్ జట్టు బలహీనమైనదే అయినా.. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగుతుండటంతో భారత టెస్ట్ టీమ్ ఎలా రాణిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.
అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్ ఆడే భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్‌దూబే
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications