India Playing XI vs Ireland: ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం.. తొలి టీ20లో ఆడే భారత తుది జట్టు ఇదే!

డబ్లిన్: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ఎంచుకునే ప్రయత్నాల్లో ఉన్న టీమిండియా చిన్న జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు(ఆదివారం) తొలి మ్యాచ్ జరగనుంది. అయితే అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో టెస్టు టీమ్‌లో లేని ఇతర ఆటగాళ్లతోనే టీమిండియా బరిలోకి దిగనుంది.
సౌతాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా... కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. రాహుల్ ద్రవిడ్ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బలాబలాలు, గత రికార్డును చూస్తే ఐర్లాండ్‌పై భారత్‌దే స్పష్టంగా పైచేయి కాగా, సొంతగడ్డపై సత్తా చాటాలని ఐర్లాండ్ భావిస్తోంది.
ఆ ఇద్దరికి అవకాశం దక్కెనా?
సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి చివరి వరకు మార్పు లేకుండా ఆ 11 మందినే ఆడించారు. అయితే ఈసారి టీమ్ మేనేజ్‌మెంట్ కొత్తగా ప్రయత్నించవచ్చు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఓ రేంజ్‌లో విజృంభించిన ఈ ఇద్దరిలో ఒక్కరికైనా తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు ఈ యువ ఆటగాళ్లు అరంగేట్రం ఖాయమని చెబుతున్నాయి.
రెండు స్థానాలు.. నలుగురు పోటీ..
బ్యాటింగ్‌పరంగా గత మ్యాచ్ ఆడిన తుది జట్టును చూస్తే పంత్, అయ్యర్ లేరు కాబట్టి రెండు స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత జట్టు నుంచి రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేయకపోగా, సామ్సన్ మరో చాన్స్ కోసం చూస్తున్నాడు. ఈ ఇద్దరి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూశాంసన్, రాహుల్ త్రిపాఠిల్లోని ఇద్దరూ ఆడే అవకాశం ఉంది.
సూర్య, హుడాకు ఎక్కువ అవకాశాలున్నాయి. మరోవైపు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో తొలి సీజన్‌లోనే సూపర్ హిట్ అయిన హార్దిక్ పాండ్యా నేషనల్ టీమ్‌ను ఎలా నడిపిస్తాడన్నది కూడా ఆసక్తిగా మారింది. ఐపీఎల్ మాదిరిగా ఇక్కడా సక్సెస్ అయితే భవిష్యత్తు కెప్టెన్‌గా అతను ముందు వరుసలోకి వస్తాడు.

పిచ్/వాతావరణం
మలహిడే స్టేడియం వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం.ఇక్కడ గత ఐదు టీ20ల్లో మూడు సార్లు 180 ప్లస్ స్కోర్లు నమోదు అయ్యాయి. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే చాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

తుది జట్లు(అంచనా)
భారత్: ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా/ సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/అర్షదీప్ సింగ్/ ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్/రవి బిష్ణోయ్
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), కర్టిస్ క్యాంపర్, ఆండీ మెక్‌బైన్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అడైర్, బారీ మెకార్తీ, జోషువా లిటిల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications