India Playing XI vs Ireland: రుతురాజ్ ఔట్.. సంజూ ఇన్! ఉమ్రాన్ డౌట్! రెండో టీ20లో ఆడే భారత జట్టు ఇదే!

డబ్లిన్: ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్.. చివరి పోరుకు సన్నదమైంది. మంగళవారం జరిగే రెండో టీ20లో విజయమే లక్ష్యంగా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్ మాదిరి ఇది కూడా గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో కనీస పోటీనివ్వకుండా దారుణంగా విఫలమైన ఐర్లాండ్ చివరి మ్యాచ్‌లోనైనా విజయాన్నందుకోవాలనే పట్టుదలతో ఉంది. కనీస ప్రదర్శనతో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటుంది. ఇక మొకాలి గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాని రుతురాజ్ గైక్వాడ్.. రెండో మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంజూకు చాన్స్..
తొలి టీ20లోనే రుతురాజ్ గాయంతో దూరమవడంతో స్పెషలిస్ట్ ఓపెనర్ లేక దీపక్ హుడాతో టీమిండియా నెట్టుకొచ్చింది. మరి రెండో టీ20కి కూడా గైక్వాడ్ అందుబాటులో లేకుంటే అతని స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో సంజూ సత్తా చాటాడు. కెప్టెన్‌గా జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కానీ టైటిల్ కలను నెరవేర్చుకోలేకపోయాడు. అయితే వ్యక్తిగతంగా ఆకట్టుకోవడంతో ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం అతనికి తుది జట్టులో చోటివ్వలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇక గైక్వాడ్ ఔటవ్వడంతో సంజూకు లైన్ క్లియర్ అయింది.

ఉమ్రాన్ మాలిక్ డౌట్..
ఐపీఎల్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్ మాలిక్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన ఉమ్రాన్ మాలిక్.. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే అవకాశం అందుకున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోయాడు. ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన ఉమ్రాన్.. ధారళంగా పరుగులిచ్చాడు. పసికూన బ్యాటర్లను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. అతని బౌలింగ్‌లో రిథమ్ కూడా కనిపించలేదు. ఈ క్రమంలోనే రెండో టీ20లో అతనికి మరో అవకాశం ఇస్తారా? అనేది సందేహంగా మారింది. ఐపీఎల్‌లో కట్టడైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న అర్షదీప్ సింగ్‌ను ఆడించే చాన్స్ ఉంది.

రాహుల్ త్రిపాఠికి చోటు దక్కెనా?.
బ్యాటింగ్‌పరంగా గత మ్యాచ్ ఆడిన తుది జట్టును చూస్తే పంత్, అయ్యర్‌కు బదులు దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్‌లు ఆడారు. హుడా సత్తా చాటగా సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. ఐపీఎల్ ప్రదర్శనతో తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న రాహుల్ త్రిపాఠి కూడా తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నాడు. అయితే అతనికి ఇప్పుడే చోటు దక్కే అవకాశం లేదు. మరోవైపు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో తొలి సీజన్‌లోనే సూపర్ హిట్ అయిన హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే జోరు కొనసాగించాడు.

భువీ సారథ్యంలో..
భువనేశ్వర్ కుమార్ సారథ్యంలోని బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. అతనికి తోడుగా ఆవేశ్ ఖాన్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్, ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. రవి బిష్ణోయ్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం చాహల్ బెంచ్‌కు పరిమితమవుతాడు. తొలి మ్యాచ్‌లో భువీ, చాహల్ సత్తా చాటారు. ఒకే వికెట్ తీసినా.. పొదుపుగా బౌలింగ్ చేశారు.

తుది జట్లు(అంచనా)
భారత్: ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్/రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేశ్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్/ ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్/రవి బిష్ణోయ్
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్నిర్నే(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లక్రాన్ టక్కర్(కీపర్), కర్టిస్ క్యాంపర్, ఆండీ మెక్‌బైన్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అడైర్, బారీ మెకార్తీ, జోషువా లిటిల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications