Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI for WTC Final: తెలుగోడికి నో ఛాన్స్.. ఆసీస్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. జూన్ 7-11 వరకు లండన్‌లో ఓవల్ మైదానం వేదికగా ఈ మెగా మ్యాచ్ జరగనుంది. రెండేళ్ల పాటు జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా, భారత్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఆస్ట్రేలియాకు ఇదే తొలిసారి కాగా.. భారత్ వరుసగా రెండో సారి టైటిల్ ఫైట్‌కు సిద్దమైంది. ఫస్ట్ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకున్న టీమిండియా ఈ సారి ఎలాగైనా విజయం సాధించి ఐసీసీ ట్రోఫీల కరువు తీర్చుకోవాలనుకుంటోంది.

India Playing XI for WTC Final

ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్లను ప్రకటించాయి. గత మంగళవారమే 15 సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసఐ వెల్లడించింది. జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోకున్నా.. గాయంతో దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ సూపర్ ఫామ్‌తో అతను ఈ అవకాశాన్ని అందుకున్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌, కుల్దీప్ యాదవ్‌పై వేటు పడగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన జట్టునే కొనసాగించారు.

తెలుగు తేజం కేఎస్ భరత్‌కు జట్టులో అవకాశం కల్పించినా తుది జట్టులో అవకాశం దక్కడం సందేహంగా మారింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. కేఎల్ రాహుల్‌ను తుది జట్టులో ఆడించేందుకు భరత్‌ను పక్కనపెట్టనున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆడనుండగా.. ఫస్ట్ డౌన్‌లో చతేశ్వర్ పుజారా బరిలోకి దిగనున్నాడు.

నాలుగు, ఐదు స్థానాల్లో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే ఆడనుండగా.. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా బరిలోకి దిగనుండగా.. ప్రధాన పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఆడనున్నారు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగితే ఉమేశ్ యాదవ్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి రానున్నాడు. ముగ్గురు పేసర్లతో ఆడితే మాత్రం అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. లండన్ పిచ్‌లు పేస్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి భారత్ నలుగురు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్/జయదేవ్ ఉనాద్కత్, మహమ్మద్ సిరాజ్

Story first published: Thursday, April 27, 2023, 13:00 [IST]
Other articles published on Apr 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+