IND vs SL: సరాన్ష్ జైన్ ఇన్.. మ్యాచ్ విన్నర్ ఔట్! శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడే భారత తుది జట్టు ఇదే!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఆడేందుకు సిద్దమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆగస్ట్ 15 నుంచి ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాలతో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా దూరం కాగా.. సాయి సుదర్శన్, జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.
గాయాల నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రెండు టెస్ట్‌లు గెలవడం టీమిండియాకు కీలకం. సొంతగడ్డపై గతేడాది నవంబర్‌లో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ క్లీన్ స్వీప్ అయ్యింది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ ఆడినా.. అది డబ్ల్యూటీసీలో భాగం కాదు.

మ్యాచ్ విన్నర్‌పై వేటు..
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ ద్వారా అరంగేట్రం చేసిన మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే రవీంద్ర జడేజా రాకతో మానవ్ సుతార్ తుది జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉంది. ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగపోవచ్చు.
ఈ క్రమంలోనే ఆఫ్ స్పిన్నర్ అయిన సరాన్ష్ జైన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన ఈ 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్.. దేశవాళీ క్రికెట్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు.
బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడనున్నాడు. జడేజా, సరాన్ష్ జైన్‌తో కలిసి కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. బుమ్రా అందుబాటులోకి రాకపోతే ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగుతాడు.
సాయి సుదర్శన్ డౌట్..
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో బరిలోకి దిగిన బ్యాటింగ్ లైనప్‌నే శ్రీలంకలో కొనసాగించే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనుండగా.. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నెంబర్3, నెంబర్ 4లో ఆడనున్నారు. రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా ఐదో స్థానంలో ఆడనుండగా.. ధ్రువ్ జురెల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కొనసాగనున్నాడు. సాయి సుదర్శన్ ఫిట్‌నెస్ సాధించకపోతే..దేవదత్ పడిక్కల్‌కు అవకాశం దక్కుతుంది.
గతేడాదిగా భారత జట్టులో భాగంగా ఉన్న దేవదత్ పడిక్కల్‌కు తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. వెస్టిండీస్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ల్లో అవకాశం ఇవ్వలేదు. అతను చివరి సారిగా ఆస్ట్రేలియాలో పెర్త్ టెస్ట్ ఆడాడు. జట్టులో ఉన్న గుర్నూర్ బ్రార్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడే భారత తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్/దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, సరాన్ష్ జైన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా/ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
శ్రీలంకతో పర్యటనకు ఎంపికైన భారత టెస్ట్ టీమ్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్,దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, సరాన్ష్ జైన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


