టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా 24 గంటల వ్యవధిలోనే మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన తొలి సూపర్ 8 పోరులో 43 పరుగులతో టీమిండియా విజయం సాధించింది. శనివారం ఆంటిగ్వాలోని వీవీ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగే రెండో సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్ బెర్త్ ఖరారు అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. వెస్టిండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా.. పేసర్లదే హవా నడుస్తోంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో భారత పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లే మూడేసి వికెట్లు తీసారు.

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పేసర్లదే హవా నడిచింది. కమిన్స్ ఏకంగా హ్యాట్రిక్ తీసాడు. ఈ క్రమంలోనే టీమిండియా ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగనుంది. అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. పేసర్లు అవసరం అనుకుంటే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతానని చెప్పాడు.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు దూరమైన మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. తొలి సూపర్-8 మ్యాచ్‌లో విఫలమైన రవీంద్ర జడేజా, శివమ్ దూబేలను పక్కనపెట్టే అవకాశం ఉంది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన నేపథ్యంలో యశస్వి జైస్వాల్‌ను బంగ్లాతో మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది.
రోహిత్ శర్మకు జతగా అతను ఓపెనింగ్ చేస్తే.. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నాడు. అప్పుడు టీమిండియాకు ఎక్స్‌ట్రా బ్యాటర్ లేని లోటు కూడా తీరుతుంది. శివమ్ దూబే, రవీంద్ర జడేజా స్థానాల్లో యశస్వి జైస్వాల్, సిరాజ్‌లు ఆడనున్నారు. ఒకవేళ శివమ్ దూబేను కొసాగించాలనుకుంటే యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితమవుతాడు. శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్‌ను కూడా ఆడించే ప్రయత్నం చేయవచ్చు.
భారత తుది జట్టు(అంచనా) vs బంగ్లాదేశ్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా