ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా సిద్దమైంది. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మినీ వన్డే ప్రపంచకప్‌కు తెరలేవనుండగా.. టైటిలే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ టోర్నీని నిర్వహిస్తుండగా.. భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్‌లో జరగనున్నాయి. గ్రూప్-లో ఉన్న భారత్.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది.
జోష్‌లో టీమిండియా..
ఫిబ్రవరి 23న జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మార్చి 2న న్యూజిలాండ్‌తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరగనున్నాయి. శనివారమే భారత ఆటగాళ్లు దుబాయ్‌కి చేరుకున్నారు. జట్టులోని ప్రతీ ఆటగాడు ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బంది పడిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా లయను అందుకున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా టచ్‌లోకి రాగా.. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

బుమ్రా లేకుండానే..
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి దూరమవ్వడం ఒక్కటే టీమిండియాకు ప్రతికూలంశం. గాయం నుంచి బుమ్రా కోలుకున్నా.. బౌలింగ్ చేసే ఫిట్‌నెస్ సాధించకపోవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అతన్ని ఈ టోర్నీకి దూరంగా ఉంచింది. భవిష్యత్తు టోర్నీలు, మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని రిస్క్ తీసుకోవద్దనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుంది. బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు.
జట్టులో ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది చర్చనీయాంశమైంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆడనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో ఆడనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్‌ను అప్‌ది ఆర్డర్ ఆడించవచ్చు.
పేసర్లుగా మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. దాంతో హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితమవుతాడు. ఒకవేళ హర్షిత్ రాణాకు అవకాశం ఇస్తే.. అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కదు.
భారత్ తుది జట్టు(అంచనా):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహహ్మద్ షమీ/అర్ష్‌దీప్ సింగ్.
భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తీ.