Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడే భారత తుది జట్టు ఇదే!

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలతో పాటు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లకు సంబంధించిన వేర్వేరు భారత జట్లను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌ను సారథిగా నియమించారు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. కోహ్లీతో పాటు రోహిత్ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీని దృష్టిలో పెట్టుకొనే కెప్టెన్సీ మార్పు చేశామని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌తోనే ప్రపంచకప్ ప్రణాళికలు ప్రారంభమవుతాయని పరోక్షంగా హింట్ ఇచ్చాడు. దాంతో ఈ సిరీస్‌లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ నేపథ్యంలో జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లు ఎవరు..? బెంచ్‌కు పరిమితమయ్యే ప్లేయర్స్ ఎవరా? అనేది చర్చనీయాంశమైంది.

India Playing XI for Australia ODIs Rohit and Kohli Return Who Misses Out

కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ..

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో ఆడనుండగా.. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఆడనుండగా.. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కనుంది. మహహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

హర్షిత్ రాణాకు ప్రసిధ్ కృష్ణ నుంచి పోటీ ఎదురవ్వనుంది. కానీ గంభీర్‌కు ప్రియ శిష్యుడు కావడం అతనికి కలిసొచ్చే అంశం. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్‌కు మాత్రం నిరాశే ఎదురవ్వనుంది. ప్రధాన ఆటగాళ్లు గాయపడితే తప్పా ఈ ముగ్గురు తుది జట్టులో ఉండే అవకాశం లేదు.


వన్డే సిరీస్‌కు భారత తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత వన్డే జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.

వన్డే షెడ్యూల్..


తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు

Story first published: Tuesday, October 7, 2025, 12:54 [IST]
Other articles published on Oct 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+