Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ ఇద్దరిపై వేటు.. పాక్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

ఆసియా కప్ 2025 టోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా తుది పోరుకు సిద్దమైంది. ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన సూర్య సేన.. ఆదివారం జరిగే ఫైనల్లో దాయాదీ పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా 6 విజయాలు సాధించిన టీమిండియా అదే జోరులో పాకిస్థాన్‌ను మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఇప్పటికే ఈ టోర్నీలో రెండు సార్లు పాకిస్థాన్‌ను భారత్ మట్టికరిపించింది. లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. సూపర్-4 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ తేలిపోయింది. కనీసం ఫైనల్లో అయినా పోటీ ఇస్తుందా? లేక ఓటమికి తల వంచుతుందా? అనేది చూడాలి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ తొలిసారి ఫైనల్ ఆడుతున్నాయి.

India Playing XI for Asia Cup Final vs Pakistan Jasprit Bumrah and Shivam Dube to Return Replacing Arshdeep Singh Harshit Rana

రెండు మార్పులతో టీమిండియా..

లీగ్, సూపర్ 4 దశలో పాకిస్థాన్ చిత్తయినా ఆ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంకను ఓడించి ఫైనల్‌కు చేరింది. అదే జోరులో భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో పాకిస్థాన్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను టీమిండియా ఏ మాత్రం లైట్ తీస్కోదు. శ్రీలంకతో సూపర్-4 మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్‌కు ముందు జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు రెస్ట్ ఇచ్చింది.

ఆ ఇద్దరిపై వేటు..

పాకిస్థాన్‌తో ఫైనల్లో ఈ ఇద్దరూ తిరిగి బరిలోకి దిగనున్నారు. దాంతో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితం కానున్నారు. అయితే శ్రీలంక మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మకు కండరాలు పట్టేయడంతో మధ్యలోనే మైదానం వీడారు. వీరి గాయాల తీవ్రత ఎక్కువగా లేకుంటే ఫైనల్ మ్యాచ్ ఆడుతారు. ఒకవేళ సీరియస్ అయితే మాత్రం వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లకు చోటు దక్కనుంది. హార్దిక్ పాండ్యా దూరమైతే అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ ఆడకపోతే రింకూ సింగ్‌కు అవకాశం దక్కుతుంది. అయితే ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఈ టోర్నీలో తిలక్ వర్మ, జితేష్ శర్మ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫైనల్లో కూడా ఈ ఇద్దరికీ నిరాశే ఎదురవ్వనుంది. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.

సూరీడు చెలరేగాలి..

ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అదిరిపోయే ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. శుభ్‌మన్ గిల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. కెప్టెన్ సూర్య ఈ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం ఫైనల్లోనైనా అతను బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్, అక్షర్ పటేల్ కూడా పర్వాలేదనిపించారు. శివమ్ దూబే బౌలింగ్‌లో రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ తిరుగు లేదు. ఈ ఇద్దరూ తమ బౌలింగ్‌తో మ్యాచ్‌ను తిప్పేస్తున్నారు. బుమ్రా కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఏ లెక్కన చూసుకున్నా.. పాకిస్థాన్ కంటే భారత్ రెండింతలు బలంగా కనిపిస్తోంది.

పాకిస్థాన్‌తో భారత్ తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.

Story first published: Saturday, September 27, 2025, 10:52 [IST]
Other articles published on Sep 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+