Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: సంజూతో సహా ఆ నలుగురు బెంచ్‌కే.. ఆసియాకప్ బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!

ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టుపై సస్పెన్స్ వీడింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను భారత సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మంగళవారం వెల్లడించాడు. సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగుతుందని స్పష్టం చేశాడు. సూర్యకు శుభ్‌మన్ గిల్ డిప్యూటీగా వ్యవహరిస్తాడని తెలిపాడు.

శుభ్‌మన్ గిల్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వగా.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మకు చోటు దక్కింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు ఎంపిక ఒక ఎత్తయితే తుది జట్టు ఎంపిక మరో ఎత్తుగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

India Playing XI For Asia Cup 2025 Sanju Samson Out and Rinku Singh s Spot in Doubt

ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ..

ఏడాది తర్వాత భారత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్.. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓపెనింగ్ కాంబినేషన్‌పై అగార్కర్ హింట్ ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ అందుబాటులో లేకపోవడంతోనే సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశాడని, అతను రెగ్యులర్ ఓపెనర్ కాదని చెప్పాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అసాధారణ ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని, అతని ద్వారా టీమిండియాకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుందన్నాడు. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయమనిపిస్తోంది.

మిడిలార్డర్‌లో తిలక్, సూర్య, హార్దిక్

మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా తిలక్ వర్మ వరుసగా రెండు శతకాలు నమోదు చేశాడు. ఒకవేళ సంజూ శాంసన్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడించాలనుకుంటే తిలక్ బెంచ్‌కు పరిమితమవుతాడు. కానీ ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన తిలక్ వర్మకే టీమిండియా మేనేజ్‌మెంట్ మొగ్గు చూపవచ్చు. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఆడనుండగా.. హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. సంజూ ఆడకుంటే ఫినిషర్‌గా జితేష్ శర్మ ఆడుతాడు. ఒకవేళ ప్రధాన వికెట్ కీపర్‌గా సంజూను ఆడిస్తే అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడు హార్దిక్ ఆరో స్థానంలో ఆడుతాడు.

ఇద్దరు స్పిన్నర్లతో..

స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగుతారు. దుబాయ్ పిచ్‌లు స్పిన్ అనుకూలంగా ఉంటాయి కాబట్టి టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నారు. ఈ ఇద్దరికి తోడు హార్దిక్ పాండ్యా మూడో పేసర్ బాధ్యతలు పోషించనున్నాడు. అయితే బుమ్రా ప్రధాన మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. అతని గైర్హాజరీలో హర్షిత్ రాణా బరిలోకి దిగుతాడు. రెండో స్పిన్నర్‌గా అభిషేక్ వర్మను వాడుకుంటే టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకోవచ్చు. అప్పుడు రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది. అదే జరిగితే కుల్దీప్, వరుణ్ చక్రవర్తీలో ఒక్కరికే అవకాశం ఉంటుంది.

ఆసియా కప్ బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ(కీపర్)/సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ


ఆసియా కప్ కోసం భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

స్టాండ్‌బై ప్లేయర్స్

ప్రసిధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్

Story first published: Wednesday, August 20, 2025, 7:00 [IST]
Other articles published on Aug 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+