ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతిలో ఉన్న టీమిండియా.. ఆసియా కప్ 2025తో రీఎంట్రీ ఇవ్వనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. మొత్తం 8 జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో యూఏఈ, పాకిస్థాన్, ఒమన్‌తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉంది. సెప్టెంబర్ 14న జరిగే రెండో గేమ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ముందు యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌ను భారత్ ప్రాక్టీస్ గేమ్‌గా వాడుకోనుంది.
ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడి జట్టులోకి శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కలేదు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది? ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు ఓపెనర్‌గా ఆడిన సంజూ శాంసన్‌ను కొనసాగిస్తారా? లేక శుభ్‌మన్ గిల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా? అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది.

యూఏఈతో తొలి మ్యాచ్‌కు పిచ్ కండిషన్స్ తగ్గట్లు జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. దుబాయ్ పిచ్ సాధారణంగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి భారత ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు తుది జట్టులో అవకాశం దక్కనుంది. ఏకైక పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ ఆడనుండగా..అతనికి పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అండగా ఉండనున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా.. తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. అతను కీలక మ్యాచ్‌ల్లో మాత్రమే బరిలోకి దిగనున్నాడు.
శుభ్‌మన్ గిల్ రాకతో సంజూ శాంసన్‌పై వేటు పడనుంది. అగార్కర్ ఇప్పటికే ఈ విషయంపై హింట్ ఇచ్చాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో సంజూ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. టీమిండియా మేనేజ్‌మెంట్ శుభ్‌మన్ గిల్‌నే ఆడించనుంది. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. అభిషేక్ శర్మ రూపంలో టీమిండియాకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లభించనుంది. ఈ క్రమంలోనే సంజూపై వేటు పడనుంది. వికెట్ కీపర్‌గా సంజూకు బదులు జితేష్ శర్మను ఆడించనున్నారు.
లోయరార్డర్‌లో సంజూ కంటే అతనే టీమిండియాకు బెటర్ ఆప్షన్ కానున్నాడు. తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడనుండగా.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, జితేశ్ శర్మ వరుసగా బ్యాటింగ్ చేయనున్నారు. ఈ కాంబినేషన్‌లో టీమిండియాకు బ్యాటింగ్ డెప్త్‌తో పాటు సిక్స్ బౌలింగ్ ఆప్షన్స్ లభించనున్నాయి.
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.