Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ నలుగురికి నిరాశే.. అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం(జూన్ 6) నుంచి న్యూ చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌ను ప్రారంభించింది. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లకు అవకాశం దక్కింది.

సాయి సుదర్శన్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్ రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్నారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుండగా.. కేఎల్ రాహుల్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. పేలవ ఫామ్‌తో రిషభ్ పంత్ తన వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు.

India Playing XI For Afghanistan Test Shubman Gill At No 4 SRH Star Harsh Dube To Debut

మిడిలార్డర్‌లో గిల్..

రెడ్ బాల్ క్రికెట్‌లో సత్తా చాటిన ఆటగాళ్లను పట్టించుకోకుండా ఐపీఎల్ స్టార్లను ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.

తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి పేస్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగనుండగా.. వాషింగ్టన్ సుందర్, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ మ్యాచ్‌తోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్‌దూబే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఒకవేళ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే రాహుల్.. మిడిలార్డర్‌లో ఆడుతారు.

ఆ నలుగురికి నిరాశే..

తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్‌లతో పాటు దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌లకు నిరాశే ఎదురుకానుంది. ఈ నలుగురు ఆటగాళ్లు బెంచ్‌కే పరిమితం కానున్నారు. గుర్నూర్ బ్రార్ ఎంపికపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. రంజీ ట్రోఫీలో 60 వికెట్లు తీసిన ఆకీబ్ నబీని కాకుండా గుర్నూర్ బ్రార్‌ను ఎంపిక చేయడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. గత రెండున్నర నెలలుగా టీ20 ఫార్మాట్‌కు అలవాటు పడిన భారత ఆటగాళ్లు.. రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఎలా రాణిస్తారనేది సందేహంగా మారింది.

అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్ ఆడే భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్.

Story first published: Thursday, June 4, 2026, 7:05 [IST]
Other articles published on Jun 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+