For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: ఆ ముగ్గురు ఔట్.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకున్న టీమిండియా.. మూడు రోజుల వ్యవధిలోనే ఆఖరి పోరు ఆడనుంది. లండన్‌లోని ది ఓవల్ మైదానం వేదికగా గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మాంచెస్టర్ వేదికగా ముగిసిన నాలుగో టెస్ట్‌ను అద్భుతమైన పోరాటంతో డ్రా చేసుకున్న టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే జోరులో ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు గెలిచే మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై కూడా సర్వాత్ర ఆసక్తి నెలకొంది.

India Playing XI For 5th Test Vs England Jasprit Bumrah and Pant OUT 2 Players IN No Kuldeep

టీమిండియాకు గాయాల బెడద..

ఆఖరి టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. నాలుగో టెస్ట్‌లో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్‌కు ముందే మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతానని చెప్పిన బుమ్రా కూడా ఆఖరి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. పైగా అతను చీల మండ గాయంతో బాధపడుతున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన మహమ్మద్ సిరాజ్‌కు కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.

నాలుగో టెస్ట్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గుడ్ న్యూస్ చెప్పాడు. జట్టులోని పేసర్లంతా ఫిట్‌గా ఉన్నారని తెలిపాడు. ఇదే నిజమైతే బుమ్రా, సిరాజ్ స్థానాల్లో అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ బరిలోకి దిగుతారు. అన్షూల్ కంబోజ్ స్థానంలో ప్రసిధ్ కృష్ణను ఆడించవచ్చు. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. కరుణ్ నాయర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు.

కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ నిరాశే..

ఆఖరి టెస్ట్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కు నిరాశే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అద్భుతమైన శతకాలతో చెలరేగారు. దాంతో ఈ ఇద్దర్నీ తప్పించలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలంటే శార్దూల్ ఠాకూర్‌ను తప్పించాల్సి ఉంటుంది. అప్పుడు టీమిండియాలో ముగ్గురు స్పిన్నర్లు అవుతారు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే పేసర్లపై అదనపు భారం పడనుంది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి.

ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ఆడే భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్/మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ/అన్షుల్ కంబోజ్

Story first published: Monday, July 28, 2025, 7:30 [IST]
Other articles published on Jul 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+