Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: రోహిత్‌పై వేటు.. కెప్టెన్‌గా బుమ్రా! ఆసీస్‌తో చివరి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

ఆస్ట్రేలియా‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమవుతోంది. శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్ట్‌లో ఆతిథ్య ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్‌ సోమవారమే ముగియగా.. ఆసీస్ 184 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగడంతో ఆఖరి మ్యాచ్‌కు 3 రోజుల గ్యాప్ మాత్రమే దొరికింది. ఇప్పటికే ఇరు జట్లు సిడ్నీకి చేరుకున్నాయి. నాలుగో టెస్ట్ విజయంతో ఈ సిరీస్‌లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి టెస్ట్‌లో భారత్ విజయం సాధిస్తే ఈ సిరీస్‌తో 2-2తో సమమవుతోంది. లేదంటే సిరీస్ ఆసీస్ వశమవుతోంది.

India Playing XI For 5th Test vs Australia Rohit Sharma Out KL Rahul To Open

సిడ్నీ టెస్ట్‌లో విజయం సాధిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే మాత్రం ఫైనల్ రేసు నుంచి టీమిండియా తప్పుకుంటుంది. ఈ క్రమంలోనే ఆఖరి టెస్ట్‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత మూడు టెస్ట్‌ల్లో చేసిన తప్పిదాలపై టీమిండియా కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బతీస్తోంది.

జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారీ విజయం సాధించిన భారత్.. రోహిత్ శర్మ రాకతో వరుస పరాజయాలను ఎదుర్కొంది. రోహిత్ ఎంట్రీతో టీమ్ కాంబినేషన్ దెబ్బతిన్నది. బ్యాటర్‌గా రోహిత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండటం జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. ఈ సిరీస్‌లో మూడు టెస్ట్‌లు ఆడిన రోహిత్.. ఐదు ఇన్నింగ్స్‌ల్లో డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే సిడ్నీ టెస్ట్‌కు రోహిత్ దూరంగా ఉండే అవకాశం ఉంది.

అతని స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనుండగా.. జట్టును బుమ్రా నడిపించే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనుండగా.. శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీ, రిషభ్ పంత్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. సిడ్నీ వికెట్ స్పిన్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

వాషింగ్టన్ సుందర్‌తో పాటు రవీంద్ర జడేజా జట్టులో కొనసాగనున్నారు. పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడనుండగా.. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ ఆడనున్నారు. నాలుగో టెస్ట్‌లో సిరాజ్ విఫలమైనా.. రెండో టెస్ట్‌లో పర్వాలేదనిపించాడు.

సిడ్నీ టెస్ట్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

Story first published: Tuesday, December 31, 2024, 11:48 [IST]
Other articles published on Dec 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+