Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ ఇద్దరిపై వేటు.. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌ ఆడే భారత తుది జట్టు ఇదే!

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి.

గబ్బా వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్ట్‌లో టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఓటమిని తప్పించుకున్న టీమిండియా.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే జోరులో బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసీస్‌ను ఓడించాలని భావిస్తోంది.

India Playing XI For 4th Test vs Australia Mohammed Siraj Out 2 Players IN

సిరాజ్‌పై వేటు..
ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రణాళికలపై ఫోకస్ పెట్టింది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో టీమిండియా మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బౌలింగ్‌లో తడబడుతున్న స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై వేటు వేయనుంది. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకోవచ్చు.

జస్‌ప్రీత్ బుమ్రాకు అండగా సిరాజ్ మరో ఎండ్‌లో రాణించలేకపోతున్నాడు. గబ్బా టెస్ట్‌లో సిరాజ్ తొడ కండరాల గాయంతో కూడా ఇబ్బంది పడ్డాడు. ఈ గాయం నేపథ్యంలో అతనికి నాలుగో టెస్ట్ నుంచి విశ్రాంతినిచ్చే ఛాన్స్ ఉంది.

జడేజా, గిల్ డౌట్..
గబ్బా టెస్ట్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రవీంద్ర జడేజాను జట్టులో కొనసాగించే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్‌లో జడేజా సత్తా చాటినా.. బౌలింగ్‌లో మాత్రం తేలిపోయాడు. బౌలింగ్ కోసం ఆలోచిస్తే జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో శుభ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టవచ్చు.

అతని స్థానంలో ధ్రువ్ జురెల్ లేదా సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. చివరి అవకాశంగా శుభ్‌మన్ గిల్‌ను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించాల్సి ఉంది. టాప్ -6 బ్యాటర్లలో ముగ్గురు చెలరేగినా టీమిండియాకు తిరుగుండదు.

ఆ బంతుల జోలీ పోకుండా..
తొలి మూడు టెస్ట్‌ల్లో చేసిన తప్పిదాల నుంచి భారత బ్యాటర్లు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలను వదిలేయడంపై భారత బ్యాటర్లు ఫోకస్ పెట్టాలి. కనీసం బంతి పాతబడేవరకైనా క్రీజులో ఓపికగా ఆడాలి. మరీ ముఖ్యంగా ఓపెనర్లు శుభారంభం అందించడం టీమిండియాకు చాలా కీలకం.

బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్/సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా/మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

Story first published: Thursday, December 19, 2024, 12:52 [IST]
Other articles published on Dec 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+