Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: వైభవ్ ఔట్.. సంజూ ఇన్! ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లండ్‌ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టోల్ వేదికగా జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇప్పటికే వరుసగా రెండు పరాజయాలతో ఈ సిరీస్‌లో 2-0తో టీమిండియా వెనుకంజలో నిలిచింది. సిరీస్ గెలిచే అవకాశాలను చేజార్చుకున్న టీమిండియా.. సిరీస్ కోల్పోకూడదంటే చివరి రెండు మ్యాచ్‌లు గెలవడం కీలకం. దాంతోనే విజయమే లక్ష్యంగా టీమిండియా సన్నదమవుతుంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఒక విజయం నమోదు చేయలేదు. దాంతో టీమిండియాకు ఈ నాలుగో టీ20 గెలవడం అనివార్యమైంది.

India Playing XI for 4th T20I vs England Sanju Samson Set to Return as Vaibhav Sooryavanshi Makes Way

సంజూ శాంసన్ రీఎంట్రీ..

ఈ క్రమంలోనే టీమిండియా తమ వ్యూహాలకు పదును పెట్టింది. మూడో టీ20లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పాఠం నేర్చుకున్న టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. సంజూ శాంసన్ స్థానంలో గత రెండు మ్యాచ్‌లు ఆడిన టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టవచ్చు. అతని స్థానంలో సంజూ రీఎంట్రీ ఇవ్వవచ్చు. లేదంటే వైభవ్‌ను కొనసాగించి అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చి సంజూను ఆడించవచ్చు. సంజూ రాకతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవ్వనుంది.

IND vs ENG: 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!

IND vs ENG: 20 ఏళ్లలో ఇదే తొలిసారి..!

మూడో టీ20 పరాజయం అనంతరం సంజూ శాంసన్‌ను ఆడించాలంటూ ఫ్యాన్స్ గట్టిగా నినాదాలు చేశారు. మరోవైపు గంభీర్ కూడా సంజూ ఎప్పుడైనా రీఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్ అందుకోవచ్చని మీడియా సమావేశంలో చెప్పాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లోనే కాకుండా బౌలింగ్ విభాగంలో కూడా మార్పులు చేయవచ్చు. హార్డ్ లెంగ్త్‌లు బాగా వేసే ప్రసిధ్ కృష్ణను జట్టులోకి తీసుకురావచ్చు. ప్రసిధ్ కృష్ణ కోసం అర్ష్‌దీప్ సింగ్‌‌కు రెస్ట్ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్జేను ఆడించాలనుకుంటే.. ఒక బౌలర్‌ను పక్కనపెట్టవచ్చు.

బుద్దుందా.. పవర్ ప్లేలో హర్షిత్ రాణాతో బ్యాటింగా?:దినేష్ కార్తీక్

బుద్దుందా.. పవర్ ప్లేలో హర్షిత్ రాణాతో బ్యాటింగా?:దినేష్ కార్తీక్

ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 తుది జట్టు(అంచనా)

వైభవ్ సూర్యవంశీ/సూర్యాన్ష్ షెడ్జే, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్//ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తీ, ప్రిన్స్ యాదవ్

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, సూర్యాన్ష్ షెడ్జే, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

Story first published: Wednesday, July 8, 2026, 13:42 [IST]
Other articles published on Jul 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+