For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: అభిషేక్ శర్మ ఔట్.. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా.. మరో పోరుకు సిద్దమైంది. బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న నాలుగో టీ20‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో బెంచ్ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తుది జట్టులో ఎవరిపై వేటు పడుతుంది? ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాచ్ విన్నర్‌ ఔట్..

గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో మూడు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జస్‌ప్రీత్ బుమ్రాకు విశాఖ టీ20 నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. మెగా టోర్నీకి ముందు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాను ఈ మ్యాచ్ నుంచి పక్కనపెట్టనున్నారు. అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. బుమ్రాను కొనసాగించాలనుకుంటే హర్షిత్ రాణాపై వేటు పడుతుంది.

మూడో టీ20కి దూరంగా ఉంచిన వరుణ్ చక్రవర్తీ బరిలోకి దిగితే రవి బిష్ణోయ్ ఉద్వాసనకు గురవుతాడు. అయితే మూడో టీ20లో బిష్ణోయ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అతను మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. వాషింగ్టన్ సుందర్ గాయపడిన నేపథ్యంలో టీమ్‌మేనేజ్‌మెంట్ బిష్ణోయ్‌ను అతనికి బ్యాకప్‌గా సిద్దం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే నాలుగో టీ20లోనూ అతన్ని కొనసాగించే అవకాశం ఉంది. అవసరమైతే వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్‌లో ఒకరికి విశ్రాంతి ఇచ్చి మరీ బిష్ణోయ్‌ను బరిలోకి దించవచ్చు.

India Playing XI for 4th T20I Abhishek Sharma Likely To Be Rested for Vizag Clash vs New Zealand

సంజూ‌కు లాస్ట్ ఛాన్స్..?

వరుసగా మూడు టీ20ల్లో విఫలమైన సంజూ శాంసన్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఆఖరి అవకాశంగా నాలుగో టీ20లో ఆడించవచ్చు. అదే జరిగితే శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశే ఎదురు కానుంది. చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరమవ్వడంతో అయ్యర్‌ను జట్టులో కొనసాగించారు. తిలక్ వర్మకు బ్యాకప్‌గా అయ్యర్‌ను రెడీ చేయాలనుకుంటే నాలుగో టీ20లో అతను ఆడవచ్చు. అప్పుడు సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్‌లో ఒకర్ని తప్పించవచ్చు. అవసరమైతే అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వవచ్చు. సిరీస్ గెలిచిన నేపథ్యంలో చివరి రెండు మ్యాచ్‌లను పూర్తిగా ప్రయోగాలకు వాడుకునే ఛాన్స్ ఉంది.

ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం ఆర్డర్‌లో మార్పులు చేయవచ్చు.

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్/శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా/అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.

Story first published: Tuesday, January 27, 2026, 10:50 [IST]
Other articles published on Jan 27, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+