Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: శుభ్‌మన్ గిల్‌పై వేటు.. సౌతాఫ్రికాతో మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఓడిన టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగే మూడో టీ20లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్, సౌతాఫ్రికా చెరొక మ్యాచ్ గెలిచాయి. దాంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1‌తో సమంగా నిలిచాయి.

పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్‌తో రెండో టీ20లో ఓడిన టీమిండియా.. ఆ తప్పిదాలను సవరించుకొని మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తుండగా.. అదే జోరును కొనసాగించి సిరీస్‌పై పట్టు సాధించాలనే యోచనలో ఆతిథ్య సౌతాఫ్రికా ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగియడంతో మూడో టీ20 అయినా రసవత్తరంగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

శుభ్‌మన్ గిల్‌పై వేటు?

తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాయం నుంచి కోలుకొని ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్ 4, 0 పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు. గిల్ కోసం అసాధారణ ప్రదర్శన కనబర్చిన సంజూ శాంసన్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది.

India Playing XI for 3rd T20I vs South Africa Sanju Samson Likely to Replace Shubman Gill

కానీ గిల్ మాత్రం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. సంజూ తర్వాత 14 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేసిన గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై చేసిన 47 పరుగులే అత్యధికం. ఈ గణంకాల నేపథ్యంలోనే గిల్‌‌ను తప్పించి సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ గిల్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇవ్వచ్చు. ఒకవేళ గిల్‌ను తప్పిస్తే మాత్రం సంజూ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.

సూర్యకు అగ్ని పరీక్ష

మరో ఓపెనర్ అభిషేక్ శర్మ రెండు టీ20ల్లో నిరాశపర్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడినా పెద్ద స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. మూడో టీ20లో అతను చెలరేగాల్సి ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. గతేడాదిగా అతను తీవ్రంగా తడబడుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. నాలుగో స్థానంలో తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అక్షర్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు.

తొలి టీ20లో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా.. రెండో మ్యాచ్‌లో నిరాశపర్చాడు. శివమ్ దూబే కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జితేష్ శర్మ తన వంతు సహకారం అందిస్తున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ సత్తా చాటుతున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా పర్వాలేదనిపిస్తున్నా.. అర్ష్‌దీప్ సింగ్ నిలకడలేమి ప్రదర్శనతో జట్టు పరాజయానికి కారణమయ్యాడు. అతను మెరుగ్గా రాణించాల్సి ఉంది.


భారత్ తుది జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్/సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్


భారత టీ20 టీమ్

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ,సంజూ శాంసన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

Story first published: Saturday, December 13, 2025, 11:21 [IST]
Other articles published on Dec 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+