శ్రీలంక పర్యటనలో టీమిండియాకు వరుసగా అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. కుర్రాళ్లతో కూడిన జట్టుతో మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చినా వన్డే సిరీస్‌లో తడబడుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకోలేకపోయింది.
సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా టై చేసుకున్న టీమిండియా.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 11 ఏళ్ల తర్వాత వన్డేల్లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో సిరీస్‌ను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం కొలంబో వేదికగానే జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్ సమమం అవుతోంది. లేదంటే శ్రీలంక వశం అవుతోంది.

ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. మిడిలార్డర్ వైఫల్యం నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో పాటు పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై వేటు వేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరి స్థానాల్లో రిషభ్ పంత్‌తో పాటు రియాన్ పరాగ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. వికెట్ల వెనుకాల సునాయస క్యాచ్‌లను నేలపాలు చేశాడు. బ్యాటింగ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగి తీవ్ర నిరాశకు గురిచేశాడు. మరోవైపు శివమ్ దూబే సైతం పేలవ బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడుతాడని అవకాశాలు ఇస్తే.. సరైన ఫుట్‌వర్క్ లేక వికెట్ల ముందు దొరికిపోతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు.
తొలి వన్డేలో విజయానికి ఒక్క పరుగు కావాల్సిన సమయంలో ఎల్బీగా వెనుదిరిగి మ్యాచ్ టైకి కారణమయ్యాడు. రెండో వన్డేలో కీలక సమయంలో అప్‌ది ఆర్డర్‌లో పంపిస్తే డకౌటయ్యాడు. ఈ క్రమంలోనే రాహుల్ స్థానంలో రిషభ్ పంత్, శివమ్ దూబే స్థానంలో స్పిన్ సామర్థ్యం కలిగిన రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్, శుభ్‌మన్ గిల్ ఆడనున్నారు. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనుండగా.. సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
శ్రీలంకతో మూడో వన్డే.. భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్/కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్/శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.