Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా ఆఖరి పోరుకు సన్నదమవుతోంది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో ఆతిథ్య శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టెస్ట్ తరహాలోనే కొలంబోలోనూ ఆధిపత్యం చెలాయించి 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో భారత్ ఉంది. తద్వారా డబ్ల్యూటీసీ 2027 ఫైనల్ బెర్త్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలనుకుంటుంది.

తొలి టెస్ట్‌లో భారత్ మూడు విభాగాల్లో సత్తా చాటింది. అయితే కుల్దీప్ యాదవ్ వైఫల్యం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో (1/65) ఒకే ఒక్క వికెట్ తీసిన కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో (0/37) ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. మరోవైపు మానవ్ సుతర్ 10 వికెట్లతో సత్తా చాటగా.. జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దాంతో కుల్దీప్ యాదవ్‌పై విమర్శలు వస్తున్నాయి.

India Playing XI for 2nd Test vs Sri Lanka Saransh Jain Likely to Replace Kuldeep Yadav Dhruv Jurel a Doubt

కుల్దీప్ యాదవ్‌పై వేటు..

అయితే కుల్దీప్ యాదవ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనగా.. అతి తక్కువ ఓవర్లు బౌలింగ్ చేసి ఎక్కువ పరుగులిచ్చాడని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్‌ను తప్పించి అతని స్థానంలో డొమెస్టిక్ వెటరన్ స్పిన్నర్ సరాన్ష్ జైన్‌‌ను ఆడిస్తారనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే 33 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన భారత క్రికెటర్‌గా సరాన్ష్ జైన్ నిలవనున్నాడు.

మరోవైపు భారత్ మూడో స్పిన్నర్‌తో ఆడాలనుకుంటే కుల్దీప్ యాదవ్‌ను కొనసాగించాలని అశ్విన్ సూచించాడు. ఆకాశ్ చోప్రా మాత్రం కుల్దీప్ యాదవ్ స్థానంలో సరాన్ష్ జైన్‌ను ఆడించవచ్చని అంచనా వేసాడు. మరి టీమ్‌మేనేజ్‌మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ధ్రువ్ జురెల్ ఔట్..

తొలి టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ గాయపడ్డాడు. మూడో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా.. అతని ఎడమ చీలమండకు గాయమైంది. దాంతో అతను మైదానం వీడగా.. సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మ్యాచ్‌లో కొనసాగాడు. ప్రస్తుతం అతని గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే రెండో టెస్ట్‌కు ధ్రువ్ జురెల్ దూరం కానున్నాడు. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగుతాడు. తొలి టెస్ట్‌లో జురెల్ హాఫ్ సెంచరీతో రాణించాడు.

మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, జైస్వాల్ ఆడనుండగా.. దేవదత్ పడిక్కల్ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగనున్నాడు. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా మిడిలార్డర్‌లో ఆడనున్నారు. తొలి టెస్ట్‌లో విఫలమైన జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మానవ్ సుతార్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడనుండగా.. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణలో ఒకరికి రెస్ట్ ఇవ్వాలనుకుంటే గుర్నూర్ బ్రార్ జట్టులోకి వస్తాడు. ఆకీబ్ నబీకి మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.

శ్రీలంకతో రెండో టెస్ట్‌కు భారత్ తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్/ సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సరాన్ష్ జైన్/కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ/గుర్నూర్ బ్రార్.

Story first published: Thursday, August 20, 2026, 11:35 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+