India Playing XI: ఆ యువ ప్లేయర్‌పై వేటు.. జింబాబ్వేతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
జింబాబ్వే పర్యటనను విజయంతో ఘనంగా ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శనివారం హరారే వేదికగా జరిగే రెండో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టీ20 తరహాలోనే ఏకపక్ష విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది.
తద్వారా ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భారత్ భావిస్తోంది. మరోవైపు రెండో టీ20లో గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో జింబాబ్వే ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆ ముగ్గురికి నిరాశే..
తొలి టీ20 జరిగిన హరారే వేదికగానే ఈ మ్యాచ్ జరగనుండటంతో టీమిండియా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. కానీ తన అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అశోక్ శర్మ(0/29)ను తప్పించి మరో యువ పేసర్ యశ్ ఠాకూర్‌కు అవకాశం ఇవ్వొచ్చు. ఈ ఒక్కటి మినహా ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదు. దాంతో సూర్యాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్ష్ దూబేలకు నిరాశే ఎదురు కానుంది.

వైభవ్‌పైనే అందరి కళ్లు..
తొలి టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సిరీస్‌ను జనాలు అతని కోసమే చూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
హరారే మైదానంలో వైభవ్‌కు మంచి రికార్డ్స్ ఉండటంతో రెండో టీ20లో అతను భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే అభిషేక్ శర్మ మాత్రం తొలి టీ20లో దారుణంగా విఫలమయ్యాడు. అతను సత్తా చాటాల్సి ఉంది.
అశోక్ శర్మ డౌట్..
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లకు అవకాశం దక్కలేదు. తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లోయరార్డర్‌లో ఆడనున్నారు. మయాంక్ యాదవ్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా ప్రిన్స్ యాదవ్ కూడా సత్తా చాటాడు. కానీ తొలి మ్యాచ్ అనే బెరుకో ఏమో కానీ అశోక్ శర్మ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. అతనికి మరో అవకాశం ఇస్తారా? లేక యశ్ ఠాకూర్ ఆడిస్తారా? అనేది చూడాలి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నాడు.
భారత్‌తో రెండో టీ20 తుది జట్టు(అంచనా)
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ/యశ్ ఠాకూర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

