Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs IRE: ఆ ఇద్దరిపై వేటు.. వైభవ్‌కు చోటు! ఐర్లాండ్‌తో రెండో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

ఐర్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొంది. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సరికొత్త చరిత్రను సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం.

IND vs IRE: ఆ ఇద్దరి వల్లే టీమిండియాకు ఓటమి!

IND vs IRE: ఆ ఇద్దరి వల్లే టీమిండియాకు ఓటమి!

ఈ ఘోర పరాజయం నేపథ్యంలో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘాటు విమర్శల మధ్య టీమిండియా రెండో టీ20కి సిద్దమైంది. ఆదివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టీ20 తరహాలోనే భారత్‌ను మట్టికరిపించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఐర్లాండ్ పట్టుదలతో ఉంది. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని అయ్యర్ సేన భావిస్తోంది.

India Playing XI for 2nd T20I Prasidh Krishna Set to Be Dropped Vaibhav Sooryavanshi May Replace Sanju Samson

ప్రసిధ్ కృష్ణపై వేటు..?

తొలి టీ20 పరాజయం నేపథ్యంలో భారత తుది జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తొలి టీ20లో దారుణంగా విఫలమైన ప్రసిధ్ కృష్ణపై వేటు పడనుంది. అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేయవచ్చు. ప్రసిధ్ కృష్ట పేలవ బౌలింగ్‌తోనే టీమిండియా ఓటమిపాలైంది.

నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిధ్ కృష్ణ 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా సత్తా చాటినా.. ప్రసిధ్ కృష్ణ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్(0/19) తీవ్రంగా నిరాశపర్చాడు. సుందర్‌ను తప్పిస్తే రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వస్తాడు.

వైభవ్ సూర్యవంశీకి చోటు..?

బ్యాటింగ్ విభాగం కూడా పూర్తిగా చేతులెత్తేసింది. అభిషేక్ శర్మ మినహా అంతా విఫలమయ్యారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లో ఒకర్ని బెంచ్‌కే పరిమితం చేయవచ్చు.

IND vs IRE: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్

IND vs IRE: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు అవసరం లేవనుకుంటే మరోసారి వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావచ్చు. ఇప్పటికే ఈ కుర్రాడికి అవకాశం ఇవ్వాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. మిగతా కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం లేదు.

ఐర్లాండ్‌తో రెండో టీ20 భారత తుది జట్టు (అంచనా)

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్/రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ/ప్రిన్స్ యాదవ్.

Story first published: Saturday, June 27, 2026, 12:14 [IST]
Other articles published on Jun 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+