India Playing XI: రోహిత్‌పై వేటు? అఫ్గాన్‌తో రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!
అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం లక్నో వేదికగా జరగనున్న రెండో వన్డేలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పర్యాటక అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. తద్వారా ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని పరీక్షించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఈ సిరీస్‌తోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాలను ప్రారంభించింది. మెగా టోర్నీకి కావాల్సిన కాంబినేషన్ కోసం ప్రయోగాలు చేస్తామని సిరీస్ ప్రారంభానికి ముందే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే రెండో వన్డేలో భారత తుది జట్టులో మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది.
కుల్దీప్ యాదవ్ రీఎంట్రీ..?
తొలి మ్యాచ్‌లో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని హర్ష్‌దూబేను టీమిండియా ఆడించింది. అతను అరంగేట్ర మ్యాచ్‌లోనే (3/47) మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చడం, అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌లో వికెట్లు తీయకపోవడంతో కుల్దీప్ యాదవ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అరంగేట్ర పేసర్ మానవ్ సుతార్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. కుల్దీప్ యాదవ్ ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. కానీ కుల్దీప్ యాదవ్‌కు వన్డేల్లో మంచి రికార్డ్ ఉంది. ఈ క్రమంలోనే అతన్ని రెండో వన్డేల్లో బరిలోకి దించే అవకాశం ఉంది.

రోహిత్ శర్మకు విశ్రాంతి..
తొలి వన్డేలో రోహిత్ శర్మ మణికట్టుకు గాయమైంది. మైదానంలోనే చికిత్స తీసుకున్న అతను ఆ తర్వాత ఆట కొనసాగించినా.. శుభ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌటయ్యాడు. తొడ కండరాల గాయం నుంచి ఇటీవలే కోలుకున్న రోహిత్.. తొలి వన్డేలో చాలా అసౌకర్యంగా కనిపించాడు.
దాంతోనే అతను రెండో వన్డే ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అతనికి విశ్రాంతి ఇస్తే యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. జైస్వాల్ కూడా చాలా రోజుల నుంచి వన్డే టీమ్‌లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
ధర్మశాల వన్డేలో అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మూడు వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. జట్టులో ఉన్న మరో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ప్రిన్స్ యాదవ్ ఆఖరి వన్డే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ అతనికి అవకాశం ఇవ్వాలనుకుంటే గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణలో ఒకరు బెంచ్‌కు పరిమితమవుతారు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పు జరిగే అవకాశం లేదు.
అఫ్గాన్‌తో రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ/యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్,ప్రసిధ్ కృష్ణ/ప్రిన్స్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

