For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: తెలుగోడికి నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన టీమిండియా 4 రోజుల వ్యవధిలోనే సుదీర్ఘ ఫార్మాట్ ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో బరిలోకి దిగనుంది. అక్టోబర్ 2( గురువారం) దసరా రోజున అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, ఆకాష్ దీప్, రిషభ్ పంత్‌లపై వేటు పడింది. గాయాల కారణంగా రిషభ్ పంత్, ఆకాస్ దీప్ ఈ సిరీస్‌లకు దూరంగా కాగా.. పేలవ ప్రదర్శనతో కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్ చోటు కోల్పోయారు.

భారత్-ఏ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆర్‌సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, బ్యాకప్ వికెట్ కీపర్గా నారయణ్ జగదీషన్ ఈ టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్ గడ్డపై నిరాశపర్చిన సాయి సుదర్శన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు స్వల్ప విరామం ప్రకటించడంతో శ్రేయస్ అయ్యర్ అవకాశాన్ని అందుకోలేకపోయాడు. గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ కూడా భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.

India Playing XI for 1st Test vs West Indies Jasprit Bumrah Set for Comeback Nitish Kumar Reddy Doubtful

నితీష్ రెడ్డికి నో ఛాన్స్..?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు కీలకం. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనుండగా.. మూడో స్థానంలో సాయి సుదర్శన్ ఆడనున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్‌ రెడ్డిలో ఒకరికి చోటు దక్కనుంది. బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే నితీష్‌కు చోటు దక్కుతుంది. లేదంటే దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగుతాడు.

వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ ఆడనున్నారు. అయితే సుందర్‌కు లోకల్ బాయ్ అక్షర్ పటేల్ నుంచి పోటీ ఎదురవ్వనుంది. అహ్మదాబాద్ అతని హోమ్ గ్రౌండ్. ఈ కోణంలో ఆలోచిస్తే అతనికే అవకాశం దక్కుతుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతారు. భారత పిచ్‌లు సహజంగానే స్పిన్‌కు అనుకూలిస్తాయి. కాబట్టి టీమిండియ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది.

వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్/నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్(కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్(కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్,అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, నారయణ్ జగదీషన్, ప్రసిధ్ కృష్ణ

Story first published: Tuesday, September 30, 2025, 11:05 [IST]
Other articles published on Sep 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+