India Playing XI: ఆ నలుగురికి నిరాశే.. శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!
శ్రీలంక పర్యటనలో టీమిండియా తొలి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం(ఆగస్ట్ 15) నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకం.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేయాలి. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్‌ల్లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు నిండా కుర్రాళ్లే ఉండటంతో భారత్ ఏ మేరకు రాణిస్తుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

శ్రీలంక ఎలెవన్‌తో మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్ ఆఖరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్స్‌లు బాది విజయాన్ని అందించడం ఆటగాళ్లకు మరింత ఆనందాన్నిచ్చింది. అదే జోరులో తొలి టెస్ట్‌లో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.
ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా..
శ్రీలంక పిచ్‌లు సాధారణంగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తమ కాంబినేషన్‌లో ఓ స్పిన్ ఆల్‌రౌండర్‌తో మొత్తం ఏడుగురు బ్యాటర్లు ఉండేలా చూసుకోనుంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్, సరాన్ష్ జైన్‌లో ఒకరికి మూడో స్పిన్నర్‌గా అవకాశం దక్కనుంది. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఈ నలుగురికి తుది జట్టులో చోటు దక్కుతుంది. అప్పుడు ఎక్స్‌ట్రా బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌పై వేటు పడుతుంది.
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనుండగా.. గాయంతో దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ఆడనున్నాడు. వామప్ మ్యాచ్‌లో అద్భుత శతకంతో పడిక్కల్ ఆకట్టుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడనుండగా.. రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు.
రంజీ కింగ్‌కు నిరాశే..
మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్పెషలిస్ట్ పేసర్లుగా ఆడనున్నారు. వామప్ మ్యాచ్‌లో సత్తా చాటిన గుర్నూర్ బ్రార్‌ను ఆడించాలనుకుంటే ప్రసిధ్ కృష్ణ బెంచ్‌కే పరిమితమవుతాడు. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన అకిబ్ నబీకి నిరాశే ఎదురుకానుంది. అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు.
శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సరాన్ష్ జైన్/మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ/గుర్నూర్ బ్రార్
శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, సరాన్ష్ జైన్, కుల్దీప్ యాదవ్, అకీబ్ నబీ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, ప్రసిధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

