Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: రిషభ్ పంత్ ఇన్.. సంజూ డౌట్! శ్రీలంకతో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్దమైంది. జూలై 27న మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌తో ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త శకం ప్రారంభం కానుంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఈ టూర్‌తోనే తన బాధ్యతలను చేపట్టనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.

ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్‌‌కు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసింది. జట్ల ఎంపికలో గౌతమ్ గంభీర్ మార్క్ నిర్ణయాలు కనిపించాయి.

India Playing XI for 1st T20I vs Sri Lanka Rishabh Pant In and SanJu Samson Out

టీ20 ప్రపంచకప్ విజయానంతరం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లంతా రీఎంట్రీ ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనలో ఆడిన కుర్రాళ్లు ఉద్వాసనకు గురయ్యారు. హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్‌లు జట్టులోకి రావడంతో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, ఆవేశ్ ఖాన్‌లపై వేటు పడింది.

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జూలై 27న పెల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. రిషభ్ పంత్ ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నాడు. నాలుగో స్థానంలో సూర్య.. ఐదో స్థానంలో శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు. అతనికి రియాన్ పరాగ్, శివమ్ దూబేతో పోటీ నెలకొంది. స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడే శివమ్ దూబేకే అధిక ప్రాధాన్యత దక్కనుంది.

రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా ఫినిషర్లుగా ఆడనుండగా.. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్పిన్నర్లుగా బరిలోకి దిగనున్నారు. మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

శ్రీలంకతో తొలి టీ20.. భారత తుది జట్టు(అంచనా):

శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రిషభ్ పంత్, శివమ్ దూబే, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్

Story first published: Saturday, July 20, 2024, 15:12 [IST]
Other articles published on Jul 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+