సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. బుధవారం కోల్‌కతా వేదికగా జరిగే తొలి టీ20లో ఇంగ్లండ్‌తో టీమీండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన సన్నాహకాలను పూర్తి చేసుకున్న టీమిండియా.. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.
మరోవైపు ఇంగ్లండ్ సైతం టీమిండియా సవాల్‌కు సిద్దమైంది. ఒక రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించింది. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. టీ20 ఫార్మాట్‌లో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉండటంతో తొలి మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్‌గా సంజూ, అభిషేక్..
టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దాంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
గత 12 ఇన్నింగ్స్‌ల్లో సంజూ.. 189.16 స్ట్రైక్‌రేట్‌తో 471 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు ఉన్నాయి. మొత్తం 44 ఫోర్లతో పాటు 33 సిక్స్‌లు కొట్టాడు. అతనికి జతగా ఐపీఎల్ సెన్సెషన్ అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నాడు. అతను 9 ఇన్నింగ్స్‌ల్లో 232 పరుగులు చేశాడు.
మూడో స్థానంలో తెలుగు తేజం తిలక్ వర్మ బరిలోకి దిగనున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో అతను వరుసగా 2 శతకాలు బాదాడు. సూర్యను అడిగి మరి ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసిన తిలక్.. రెండు సెంచరీలతో ఆ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో ఆడనున్నారు. సౌతాఫ్రికా పర్యటనలో తేలిపోయిన రింకూ సింగ్.. ఈ సిరీస్‌లో రాణించాల్సి ఉంది.
నితీష్ కుమార్ రెడ్డికి నో ఛాన్స్..
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జోరు కొనసాగించాడు. అయినా అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వడంతో నితీష్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫస్ట్ ఛాయిస్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ ఆడనున్నాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లోఉన్నాడు. పేసర్లుగా మహమ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా బరిలోకి దిగనున్నారు. 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత షమీ ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఆ ఇద్దరికి నిరాశే..
ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్‌కు నిరాశే ఎదురవ్వనుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ బెంచ్‌కే పరిమితం కానున్నారు. ఎక్స్‌ట్రా స్పిన్ ఆల్‌రౌండర్ కావాలనుకుంటే సుందర్‌కు అవకాశం దక్కుతుంది.
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ.
టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత్ జట్టు:
సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.