న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో తలపడే భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. శుభ్‌మన్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. గాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇచ్చాడు. కానీ అతను ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వగా.. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీతో రుతురాజ్ గైక్వాడ్‌పై వేటు పడింది. తిలక్ వర్మ కూడా ఉద్వాసనకు గురయ్యాడు. జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
టీమిండియా ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగనున్నారు. గిల్ రీఎంట్రీతో యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. రోహిత్, కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండగా.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ సాధించకపోతే అతని స్థానంలో రిషభ్ పంత్ ఆడనున్నాడు. యశస్వి జైస్వాల్‌ను ఆడించాలనుకుంటే గిల్ మిడిలార్డర్‌లో ఆడుతాడు. అప్పుడు పంత్ బెంచ్‌కే పరిమితమవుతాడు.

వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడనుండగా.. రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఏడో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు. ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే నితీష్.. స్పిన్నర్ కావాలనుకుంటే సుందర్ ఆడుతాడు.
హర్షిత్ రాణా 8వ స్థానంలో ఆడనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ప్రసిధ్ కృష్ణతో పాటు యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్)/రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి/వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.