India Playing XI: అతనికి నో ఛాన్స్.. అఫ్గానిస్థాన్‌తో తొలి వన్డే ఆడే భారత జట్టు ఇదే!
సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ధర్మశాల వేదికగా శనివారం జరిగే(జూన్ 13) తొలి మ్యాచ్‌తో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది.
తొడ కండరాల గాయాలతో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు లేకున్నా..టీమిండియా ఈజీగా ఈ సిరీస్ గెలిచే అవకాశం ఉంది. ఈ సిరీస్‌తోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాలు ప్రారంభంకానున్నాయి. అయితే కోహ్లీ, హార్దిక్ గైర్హాజరీ నేపథ్యంలో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్లుగా రోహిత్, రాహుల్..
కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ 2026 సమయంలో రోహిత్ శర్మ తొడకండరాల గాయానికి గురయ్యాడు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్ ఫిట్‌నెస్ టెస్ట్ కూడా క్లియర్ చేసి జట్టుతో కలిసాడు. వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్ ఈ సారి బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది. ఏకైక టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అదే జోరును కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.

మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. కోహ్లీ స్థానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేయనుండగా.. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు కీపింగ్ చేయనున్నాడు.
తెలుగోడికి ఛాన్స్..
నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో నితీష్ రెడ్డికి వరుస అవకాశాలు దక్కనున్నాయి. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడనున్నాడు. మూడో పేసర్‌గా ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ప్రిన్స్ యాదవ్‌కు అఫ్గాన్‌తో సిరీస్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.
అతనికి నిరాశే..
విరాట్ కోహ్లీ స్థానంలో భారత జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌కు నిరాశే ఎదురుకానుంది. కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతుండటంతో యశస్వి జైస్వాల్‌కు అవకాశం లేకుండా పోయింది. ఏ ఆటగాడైనా గాయపడితే తప్పా యశస్వి జైస్వాల్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధిస్తే.. మూడో వన్డేలో బెంచ్ ఆటగాళ్లను పరీక్షించవచ్చు.
అఫ్గాన్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

