Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI 4th T20: శుభ్‌మన్ గిల్‌పై వేటు.. విండీస్‌తో నాలుగో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

ఫ్లోరిడా: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌ల కోసం అగ్రరాజ్యం అమెరికాకు చేరిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మూడు రోజుల విరామం అనంతరం శనివారం ఫ్లోరిడా వేదికగా జరగబోయే నాలుగో టీ20లో వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

రెండు వరుస పరాజయాల తర్వాత అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా.. అదే జోరులో మరో గెలుపును నమోదు చేసి సిరీస్ సమం చేయాలనుకుంటోంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం నాలుగో టీ20లోనే విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. దాంతో నాలుగో టీ20 కీలకంగా మారింది.

Shubman Gill

మూడో టీ20లో ఏకైక మార్పుతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో టీ20లోనూ మార్పులు చేసే అవకాశం ఉంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై వేటు వేసి ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మూడో టీ20లో తొలి అవకాశాన్ని అందుకున్న యశస్వీ జైస్వాల్ తీవ్రంగా నిరాశపరిచినా అతనికి మరో అవకాశం ఇవ్వనుంది.

ఓపెనర్లు ఇద్దరూ లెఫ్టాండర్లు అవుతారని భావిస్తే మాత్రం శుభ్‌మన్ గిల్ తుది జట్టులో కొనసాగవచ్చు. లేదంటే సూర్యను ఓపెనర్‌గా ఆడించవచ్చు. బౌలింగ్ విభాగంలో పిచ్ కండిషన్స్ బట్టి యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకోనున్నారు. స్పిన్‌కు అనుకూలంగా లేకుంటే చాహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్‌లో ఒకరు అవకాశం అందుకోనున్నారు.

సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సూపర్ ఫామ్‌లో ఉండగా.. హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ సత్తా చాటాల్సి ఉంది. ముకేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా కొనసాగించనున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే సిరీస్ అవకాశాలు గల్లంతవ్వనున్నాయి. ఇప్పటికే యువ ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ వారికి కీలకం కానుంది.

ముఖ్యంగా ఆసియాకప్, వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్న ఆటగాళ్లు చివరి రెండు టీ20ల్లో చెలరేగాల్సి ఉంది.

భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్/శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/ఆవేశ్ ఖాన్

Story first published: Friday, August 11, 2023, 20:00 [IST]
Other articles published on Aug 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+