న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వరుస ఓటములతో చతికిలపడిన టీమిండియా.. చివరి మ్యాచ్‌కు సిద్దమైంది. ముంబైలోని వాంఖడే వేదికగా శుక్రవారం(నవంబర్ 1)నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అనూహ్యంగా తొలి రెండు టెస్ట్‌ల్లో పరాజయంపాలైన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది.
కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది.ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే తొలి సిరీస్ విజయాన్నందుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.

దాంతో మూడో టెస్ట్ కూడా ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. తొలి రెండు టెస్ట్‌ల్లో చేసిన తప్పిదాలపై టీమిండియా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చింది. బ్యాటర్లంతా సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
మిడిలార్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, అశ్విన్ రాణించినా.. వారిలో నిలకడ లోపించింది. అందరూ సమష్టిగా రాణిస్తేనే టీమిండియాకు విజయం దక్కనుంది. టాపార్డర్ విషయంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం.. సర్పరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లో ఒకరిపై వేటు పడనుంది.
స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కొనసాగనున్నారు. వాంఖడే పిచ్‌పై తొలి రోజు బౌన్స్ ఉండనుండగా.. రెండో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలించనుంది. ఈ క్రమంలోనే భారత్ ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. భారత స్పిన్నర్లు సత్తా చాటుతున్నా.. బ్యాటర్లు గింగిరాలు తిరిగే బంతులను ఎదుర్కోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించకపోతే టీమిండియాకు మరో ఓటమి తప్పదు.
పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రాకు రెస్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నా.. చివరి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి కావడంతో అతన్ని తుది జట్టులో కొనసాగించే ఛాన్స్ ఉంది. ఒకవేళ బుమ్రా దూరమైతే ఆకాశ్ దీప్, సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకుంటారు. లేకుండా ఆకాశ్ దీప్‌పై మాత్రం వేటు పడుతోంది.
హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నాడని ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదని, అసలు అతను జట్టుకే ఎంపికవ్వలేదని టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పష్టం చేశాడు.
తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.