India Playing XI 3rd ODI:సూర్య, శార్దూల్ ఔట్.. ఇషాన్,అర్షదీప్‌కు చాన్స్! మూడో వన్డే ఆడే భారత్ తుది జట్టు ఇదే!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ గడ్డపై జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరగనున్న నామమాత్రమైన చివరి వన్డేలో వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా.. మూడో మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది.
మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడి గెలుపు ముంగిట బోర్లాపడిన విండీస్.. చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. తద్వారా తమకు ఇష్టమైన టీ20 సిరీస్‌లో ఉత్సాహంగా బరిలోకి దిగాలనుకుంటుంది. దాంతో మూడో వన్డే కూడా అభిమానులను కనువిందు చేయనుంది.

బెంచ్ ఆటగాళ్లకు చాన్స్..
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో చివరి వన్డేలో బెంచ్ ఆటగాళ్లకు టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వనుంది. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, అర్షదీప్ సింగ్‌లు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురు జట్టులోకి వస్తే ఎవరిని పక్కనపెడతారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రుతురాజ్ జట్టులోకి రావాలంటే ఓపెనింగ్ స్లాట్ ఖాళీ అవ్వాలి. కెప్టెన్ శిఖర్ ధావన్‌ను పక్కనపెట్టలేని పరిస్థితి. శుభ్‌మన్ గిల్ రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. అయితే రుతురాజ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం శుభ్‌మన్ గిల్‌కు రెస్ట్ ఇవ్వొచ్చు.

సూర్య ఔట్.. ఇషాన్ ఇన్..
వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జట్టులోకి రావాలంటే మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టాలి. అతను తొలి మ్యాచ్‌లో విఫలమైనా రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పెద్దగా అవకాశాలు రాని సంజూను పక్కనపెట్టే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. అవసరమైతే టీ20 సిరీస్ ఆడనున్న సూర్యకుమార్ యాదవ్‌కు రెస్ట్ ఇచ్చి ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వచ్చు. సూర్య రెండు వన్డేల్లో దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ హుడా సైతం పెద్దగా ఆకట్టుకోపోయినప్పటికీ బౌలింగ్ చేయడం అతనికి అడ్వాంటేజ్.

అర్షదీప్ సింగ్‌కు చాన్స్...
టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కనుంది. పొత్తి కడుపు గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటనలో అవకాశం అందుకోలేకపోయిన అర్షదీప్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ మ్యాచ్ కచ్చితంగా చోటిచ్చే చాన్సుంది. అతని కోసం మహమ్మద్ సిరాజ్ లేదా శార్దూల్ ఠాకూర్‌లో ఒకరికి రెస్ట్ ఇవ్వొచ్చు. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ టీమ్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయడంతో పాటు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు శార్దూల్ 5 వికెట్లు తీసినా చాలా ఎక్స్‌పెన్సీవ్‌గా ప్రూవ్ అయ్యాడు. బ్యాటింగ్‌లో కూడా పెద్దగా రాణించలేదు. కాబట్టి శార్దూల్‌కు రెస్ట్ ఇచ్చే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

భారత తుది జట్టు(అంచనా)
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్/రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్/అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications