
శార్దూల్ ఔట్.. ఉమ్రాన్ ఇన్
రెండో వన్డేలో టీమిండియా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర డబుల్ సెంచరీకి.. మహమ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శన తోడవ్వడంతో టీమిండియా విజయాన్నందుకుంది. దాంతో విన్నింగ్ కాంబినేషన్‌నే టీమ్‌మేనేజ్‌మెంట్ కొనసాగించే అవకాశం ఉంది. కాకపోతే రెస్ట్ పేరిట బెంచ్‌కు పరిమితం చేసిన పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే తొలి వన్డేలో విఫలమైన శార్దూల్ ఠాకూర్‌పై వేటు పడవచ్చు. హైదరాబాద్ వన్డేలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీసినా.. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఏడు వైడ్లు వేసి విమర్శలపాలయ్యాడు. కానీ ఆఖరి ఓవర్‌లో విధ్వంసకర బ్రేస్‌వెల్‌ను ఔట్ చేసి భారత్ విజయాన్నందించాడు.

మహమ్మద్ షమీ డౌట్..
ఇక వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న మహమ్మద్ షమీకి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప్పల్ మ్యాచ్‌లో షమీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఓ వికెట్ తీసినా.. కీలక సమయంలో ధారళంగా పరుగులిచ్చాడు. ఎంతో అనుభవం ఉన్న షమీ.. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి రెస్ట్ ఇవ్వాలనే యోచనలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌కు డోకా ఉండదు. అప్పుడు షమీ ప్లేస్‌లో ఉమ్రాన్ బరిలోకి దిగుతాడు.

రజత్ పటీదార్, శ్రీకర్ భరత్‌కు నిరాశే..
బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగుతారు. డబుల్ సెంచరీతో శుభ్‌మన్ గిల్ ఓపెనర్ ఎవరా? అనే చర్చకే ముగింపు పలికాడు. రోహిత్ అద్భుతమైన ఆరంభాలు ఇస్తున్నా.. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఉప్పల్ మ్యాచ్‌లో విఫలమైనా విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రాయ్‌పూర్‌లో అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. మిడిలార్డర్‌లో బరిలోకి దిగిన ఇషాన్ విఫలమైనా.. అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. అతను భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. టాప్-5లో మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో రజత్ పటీదార్, శ్రీకర్ భరత్‌లు బెంచ్‌కే పరిమితం కానున్నారు.

ఆల్‌రౌండర్లుగా హార్దిక్, సుందర్..
ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. దాంతో షెహ్‌బాజ్ అహ్మద్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ చోటుకు డోకా లేదు. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కుల్దీప్ అదరగొడుతున్నాడు. దాంతో చాహల్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. పేస్ విభాగాన్ని మహమ్మద్ సిరాజ్ నడిపించనున్నాడు. మహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్‌లతో కలిసి పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు.

భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్/శార్దూల్ ఠాకూర్


Click it and Unblock the Notifications












