
ఓపెనర్లుగా రుతురాజ్, ధావన్
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్‌కు జతగా రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే రుతురాజ్‌కు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ నుంచి తీవ్ర పోటీ ఉండనుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ నేపథ్యంలో శిఖర్ ధావన్‌కు జతగా రుతురాజ్ ఆడే అవకాశమే ఎక్కువగా ఉంది. వికెట్ కీపర్‌గా ఇషాన్‌కు జట్టులో చోటు ఖాయం అప్పుడు అతను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయవచ్చు. మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తీసుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

మిడిల్‌లో సూర్య, హుడా, అయ్యర్..
మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో అయ్యర్ మినహా ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఒకవేళ ఇషాన్ ఫస్ట్ డౌన్‌లో ఆడితే హుడా, అయ్యర్‌లో ఒకరు చోటు కోల్పోయే అవకాశం ఉంది. ఆరో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడనుండగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు.

సిరాజ్ సారథ్యంలో..
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో బుమ్రా స్థానంలో సిరాజే బరిలోకి దిగాడు. ఈ లెక్కన వెస్టిండీస్‌తో తొలి వన్డేలోనూ అతనే బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. అతనికి తోడుగా శార్దూల్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగనున్నాడు. నాలుగో పేసర్ అవసరమైతే ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్‌లో ఒకరు ఆడుతారు. ఏకైక స్పిన్నర్‌గా చాహల్ ఆడటం ఖాయం.
తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్(కెప్టెన్),ఇషాన్ కిషన్/ రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా/సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్/ అర్షదీప్ సింగ్


Click it and Unblock the Notifications
