
రుతురాజ్, అయ్యర్‌కు చాన్స్..
సౌతాఫ్రికా పర్యట నుంచి తుది జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఐపీఎల్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్‌కు చివరి మ్యాచ్‌లో అవకాశం దక్కనుంది. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ ఇంటికెళ్లిపోవడంతో వారిస్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రానున్నారు. రోహిత్ శర్మతో కలిసి రుతురాజ్ ఓపెనింగ్ చేస్తే.. ఇషాన్ కిషన్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఫస్ట్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వస్తే.. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ రానున్నాడు. వికెట్ కీపింగ్ చేయనున్న ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే చాన్సుంది.

అయ్యర్‌కు రెస్ట్.. దీపక్ హుడాకు చాన్స్!
ఫినిషర్ పాత్రలో జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. ఫస్ట్ టీ20లో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి భారత్‌ను గెలిపించిన సూర్య.. రెండో టీ20లో రిషభ్ పంత్‌తో కలిసి కీలక భాగస్వామ్యంతో జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మూడో టీ20లో అతనికి రెస్ట్ ఇవ్వాలని భావిస్తే మాత్రం దీపక్ హుడాకు అవకాశం దక్కనుంది. వన్డే సిరీస్‌లో అనూహ్యంగా లభించిన అవకాశాన్ని దీపక్ హుడా రెండు చేతులతో ఒడిసి పెట్టుకున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. రెండో టీ20లో ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసిన హర్షల్ పటేల్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

ఆవేశ్ ఖాన్ అరంగేట్రం..
గతేడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎదురు చూస్తున్న యువ పేసర్ ఆవేశ్ ఖాన్.. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్‌కు విశ్రాంతినిచ్చి ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ను ఆడించే అవకాశం ఉంది. దీపక్ చాహర్ మాదిరి శార్దూల్ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఆవేశ్ ఖాన్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాక వికెట్లు కూడా తీయగలడు. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కవచ్చు.

భారత్ తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్/దీపక్ హుడా, దీపక్ చాహర్/ శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్/ మహమ్మద్ సిరాజ్/ ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్.


Click it and Unblock the Notifications
