India Playing XI: దీపక్ చాహర్ ఔట్.. శార్ధూల్‌కు చాన్స్! విండీస్‌తో రెండో టీ20లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

కోల్‌కతా: రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు టీ20ల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకపక్ష విజయాన్నందుకుంది. ఈ విజయ ఉత్సాహంలోనే మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్దమవుతోంది. ఇదే ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరగనున్న రెండో టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోను గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది.
తద్వారా ఆఖరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాలనుకుంటుంది. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో అత్యంత డేంజరస్ టీమ్ అయిన వెస్టిండీస్.. పరవు కోసం పాకులాడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటుంది. అయితే జట్టులో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గాయంతో దీపక్ చాహర్ ఔట్..
తొలి టీ20లో తీవ్రంగా గాయపడిన దీపక్ చాహర్‌కు రెండో టీ20కి దూరం కానున్నాడు. కీరన్ పొలార్డ్ కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో దీపక్ చాహర్ కుడి చేతికి గాయమైన విషయం తెలిసిందే. తన కోటా ఓవర్లు పూర్తి కాకుండానే డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిపోయాడు. గాయం తీవ్రత నేపథ్యంలోనే అతను చివరి ఓవర్ వేయలేదు. అయితే అతని గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా రెండో టీ20 నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోనున్నారు.

ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్..
ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నారు. తొలి టీ20 ఈ జోడీ మంచి శుభారంభం అందించింది. ముఖ్యంగా హిట్ మ్యాన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం కాస్త తడబడ్డాడు. ఐపీఎల్ ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడో ఏమో తెలియదు కానీ చాలా ఇబ్బంది పడ్డాడు. రెండో టీ20లోనైనా అతను తనదైన శైలిలో చెలరేగాల్సి ఉంది. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరమైన నేపథ్యంలో వచ్చిన ఈ అవకాశాన్ని ఇషాన్ కిషన్ ఉపయోగించుకోవాలి. ఇక రెండో టీ20లోనూ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కేలా లేదు.

కోహ్లీ కొట్టాలి..
మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. తొలి టీ20లోను విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను రాణించాల్సి ఉంది. ఇక రిషభ్ పంత్ సైతం ఆకట్టుకోలేకపోయాడు. అతను కూడా ఓ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం నెంబర్ 6లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు. ఈ ఇద్దరూ సూపర్ బ్యాటింగ్‌తో భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. దీపక్ చాహర్ దూరమైన శార్దూల్ ఠాకూర్ రాకతో లోయరార్డ్ బ్యాటింగ్ మరింత బలం కానుంది. హర్షల్ పటేల్ సైతం బిగ్ హిట్స్ ఆడగలడు.

మార్పుల్లేవ్..
అరంగేట్ర మ్యాచ్‌లోనే రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆరంభంలో కొంత కంగారు పడ్డా ఆ తర్వాత దుమ్మురేపాడు. సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి మరిన్ని అవకాశాలు దక్కనున్నాయి. అతనికి తోడుగా యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కనుంది. చాహల్ ఒక్క వికెట్ తీసినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశాడు. పేసర్లుగా శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌లు బరిలోకి దిగనున్నారు. సిరాజ్‌కు నిరాశ తప్పేలా లేదు.

భారత్ తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్/ శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications