Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing 11 vs WI: ఆవేశ్ ఖాన్‌ ఇన్.. ప్రసిధ్ కృష్ణ ఔట్.. రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

 India Playing 11 vs WI 2nd ODI: Avesh Khan likely to replace Prasidh Krishna

హైదరాబాద్: వెస్టిండీస్ గడ్డపై శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయాన్నందుకున్న భారత్.. ఆదివారం జరిగే రెండో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ వన్డే కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఓటమి ముంగిట బోర్లా పడిన విండీస్ ప్రతీకారంతో రగిలిపోతుంది. దాంతో తొలి వన్డేను మించిన ఉత్కంఠ అభిమానులకు ఈ మ్యాచ్‌లో కలగనుంది. ఇక ఈ మ్యాచ్‌కు టీమిండియా మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.

 ఓపెనర్లుగా ధావన్, శుభ్‌మన్ గిల్

ఓపెనర్లుగా ధావన్, శుభ్‌మన్ గిల్

తొలి వన్డేలో అనూహ్యంగా కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రుతురాజ్, ఇషాన్‌లను కాదని శుభ్‌మన్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వగా.. అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. రెండేళ్ల తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటి ద్వితీయ శ్రేణి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేపనిలో పడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌తో శుభ్‌మన్ చోటుకు డోకా లేకుండా పోయింది. ధావన్‌తో కలిసి 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఇదే జోరును ఈ జోడీ రెండో వన్డేలో చూపిస్తే భారత్‌కు తిరుగుండదు.

 మిడిల్‌లో సూర్య, హుడా, శాంసన్, అయ్యర్..

మిడిల్‌లో సూర్య, హుడా, శాంసన్, అయ్యర్..

మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు. తొలి వన్డేలో ఫస్ట్ డౌన్‌లో వచ్చిన అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. హుడా కొన్ని పరుగులు చేసినా అవి అతని స్థాయికి తగినవి కాదు. టాపార్డర్ చేలరేగిన వేళ మిడిలార్డర్ విఫలమవడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. రెండో మ్యాచ్‌లోనైనా సూర్య, హుడా, శాంసన్ రాణించాల్సింది. ముఖ్యంగా శాంసన్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో కనుక రాణించకుంటే అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే.

 సిరాజ్ సారథ్యంలో..

సిరాజ్ సారథ్యంలో..

స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తున్నాడు. తొలి వన్డేలో అద్భుత బౌలింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. చివరి ఓవర్‌లో 15 పరుగులివ్వకుండా అడ్డుకున్నాడు. అతనికి శార్దూల్, ప్రసిధ్ సహకరిస్తుండగా.. స్పిన్నర్లుగా చాహల్, అక్షర్ పటేల్‌ రాణిస్తున్నారు. మొకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న జడేజా ఈ మ్యాచ్‌కు కూడా దూరమైన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్‌లో ధారళంగా పరుగులిచ్చి వికెట్లు తీయని ప్రసిధ్‌ను పక్కనపెట్టాలనుకుంటే ఆవేశ్ ఖాన్ జట్టులోకి వస్తాడు.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ/ఆవేశ్ ఖాన్

Story first published: Saturday, July 23, 2022, 16:14 [IST]
Other articles published on Jul 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+