India Playing XI: పంత్‌కు రెస్ట్.. రవి బిష్ణోయ్‌కు చాన్స్! వెస్టిండీస్‌తో తొలి టీ20లో బరిలోకి దిగే భారత జట్టు

కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో వైట్ వాష్ చేసిన టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా వేదికగా ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ గెలిచిన జోరులోనే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకుంటుంది.
మరోవైపు, వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విండీస్ జట్టు.. పొట్టి ఫార్మాట్‌లో రాణించి సత్తా చాటాలని చూస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికిన యువ ఆటగాళ్లపై టీమిండియా భారీ ఆశలు పెట్టుకొంది. అయితే జట్టులో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్..
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు. రెగ్యులర్ పార్ట్‌నర్ కేఎల్ రాహుల్ గాయంతో దూరమవడంతో ఇషాన్ కిషన్‌కు లైన్ క్లియర్ అయింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. మరో మ్యాచులో రిషభ్ పంత్‌తో ప్రయోగాలు చేశారు. అయితే, ప్రస్తుత టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే, జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న మరో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది.

రిషభ్ పంత్‌కు రెస్ట్..
ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగనున్న టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా షెడ్యూల్ బిజీగా ఉంటుంది. అందుకే, రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కి కాస్త విరామం ఇవ్వడంలో తప్పేం లేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వొచ్చు. అలాగే, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లపై ప్రయోగాలు చేయవచ్చు. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అలాగే, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్‌లకు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి సత్తా చాటగలరు. కాబట్టి, లోయర్ ఆర్డర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

బిష్ణోయ్‌కి అవకాశం వస్తుందా.?
టీమిండియా రెగ్యులర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు, గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న యువ ఆటగాడు రవి బిష్ణోయ్‌ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, హర్షల్ పటేల్‌లకు అవకాశం దక్కనుంది.

భారత్ తుది జట్టు (అంచనా)..
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications