Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: మయాంక్ డౌట్.. దీపక్‌ హుడాకు చాన్స్! వెస్టిండీస్‌తో తొలి వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

 India Playing 11 vs WI 1st ODI: Mayank Agarwal Doubt And Deepak Hooda likely to make debut
IND VS WI: Shreyas Iyer, Dhawan Many Of India Squad Test COVID Positive | Oneindia Telugu

అహ్మదాబాద్: సౌతాఫ్రికా గడ్డపై ఘోర వైఫల్యం అనంతరం టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే అహ్మదాబాద్ చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియాను కరోనా కాటేసింది. జట్టులోని కీలక ఆటగాళ్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వైరస్ బారిన పడి జట్టుకు దూరమయ్యారు.

కీలక ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కూడా కరోనా బారిన పడటంతో సిరీస్ వాయిదా పడుతుందా? అనే సందేహం కలిగింది. కానీ ఇతర ఆటగాళ్లంతా సురక్షితంగానే ఉండటంతో టీమిండియా గురువారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం. భారత్‌కు ఇది 1000 వన్డే కాగా.. పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన రోహిత్‌కు ఫస్ట్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 ఓపెనర్లుగా ఇషాన్, రోహిత్..

ఓపెనర్లుగా ఇషాన్, రోహిత్..

కరోనాతో కీలక ఆటగాళ్లంతా దూరమైన నేపథ్యంలో టీమిండియా బరిలోకి దిగే తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెప్టెన్ రోహిత్ శర్మతో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తవానికి వన్డే సిరీస్‌కు ఇషాన్ కిషన్ ఎంపికవ్వలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ వైరస్ బారిన పడటంతో ఇషాన్‌తో పాటు మయాంక్ అగర్వాల్‌ను వన్డే జట్టులోకి చేర్చారు. మయాంక్ అగర్వాల్ మూడు రోజు క్వారంటైన్ మ్యాచ్ రోజే ముగియనుండగా.. టీ20 సిరీస్‌కు ఎంపికైన ఇషాన్ కిషన్ ఇప్పటికే టీమ్‌తో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. సోదరి వివాహం నేపథ్యంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫస్ట్ వన్డేకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

దీపక్ హుడా అరంగేట్రం..

దీపక్ హుడా అరంగేట్రం..

ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ రానుండగా.. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ రానున్నాడు. ఇక ఆరో స్థానంలో బరిలోకి దిగాల్సిన అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ వైరస్ బారిన పడటంతో బౌలింగ్ సౌమర్థ్యం కలిగిన దీపక్ హుడా అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో కూడా టీమిండియా పిలుపును అందుకున్న దీపక్ హుడా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ సారి మాత్రం అవకాశం రానుంది.

స్పిన్నర్లుగా చాహల్, సుంధర్..

స్పిన్నర్లుగా చాహల్, సుంధర్..

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా.. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన సుంధర్‌కు కూడా అవకాశం దక్కనుంది. అయితే కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం సుంధర్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. చాహల్, కుల్దీప్ కలిసి మ్యాచ్‌లు ఆడి చాలా రోజులు అయింది. కుల్చా జోడీ భారత్‌కు ఎన్నో విజయాలు అందించింది. ఆ రికార్డులను పునరావృతం చేయాలని భావిస్తే మాత్రం కుల్దీప్‌ను ఆడించవచ్చు. పైగా దీపక్ చాహర్, శార్దూల్ రూపంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు ఉండటం జట్టుకు అడ్వాంటేజ్ అయింది.

సిరాజ్ నేతృత్వంలో..

సిరాజ్ నేతృత్వంలో..

స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో భారత పేస్ విభాగాన్ని మహమ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అతనికి తోడుగా దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణలను తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రసిధ్ కృష్ణ బెంచ్‌కే పరిమితం కావచ్చు. అయితే శార్దూల్, దీపక్ ఒకే తరహా బౌలర్లు కావడంతో ఈ ఇద్దరిలో ఒకరినే తీసుకునే అవకాశాలున్నాయి.

భారత్ తుది జట్టు(అంచనా)

భారత్ తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుంధర్/కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్/ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Friday, February 4, 2022, 16:47 [IST]
Other articles published on Feb 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+