
మార్పులు ఖాయం..
పేకమేడలో ఒక పేక ముక్కను తీస్తే ఎలా కూలుతుందో టీమిండియా కాంబినేషన్ కూడా అలానే ఉంది. రవీంద్ర జడేజా ఉన్నంత వరకు చాలా బలంగా కనిపించిన భారత్.. అతను గాయంతో దూరమవడంతో పటిష్ట కాంబినేషన్ చెల్లా చెదురైంది. జడేజా గైర్హాజరీలో లెఫ్టాండర్ కోసం దినేశ్ కార్తీక్‌ను కాదని పంత్‌ను ఆడించగా.. అతను నిర్లక్ష్యపు షాట్‌తో టీమ్ కొంపముంచాడు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా ఫినిషర్ లోటును ఎదుర్కొంది. దినేశ్ కార్తీక్ విలువ ఏంటో తెలుసొచ్చింది. దీపక్ హుడా సైతం అంచనాలను అందుకోలేకపోయాడు. దాంతో భారత్ 10-15 పరుగులు తక్కువ చేసింది. ఈ క్రమంలోనే తుది జట్టులో మళ్లీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

పంత్ ఔట్.. కార్తీక్ ఇన్..
ఇక వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌పై వేటు పడటం ఖాయం కాగా.. అతని స్థానంలో దినేశ్ కార్తీక్‌కు అవకాశం దక్కనుంది. ఇక రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ హుడాకు బదులు అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకొని జడేజాలా అప్‌ది ఆర్డర్‌లో ఆడించే అవకాశం ఉంది. లెఫ్టాండర్ కొరత తీరాలంటే భారత్ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ ఇదే. అయితే పంత్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం దీపక్ హుడాను తప్పించి కార్తీక్‌ను ఆడించవచ్చు.

విరాట్ కోహ్లీ డౌట్..
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం ఖాయం. గత మ్యాచ్‌తో రాహుల్ సైతం ఫామ్‌లోకి రావడం ఖాయం. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడటం ఖాయం. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే అతను గాయంతో ఫీల్డింగ్ చేయకుండా డగౌట్‌కు పరిమితమయ్యాడు. ఈ గాయం నేపథ్యంలో అతనికి విశ్రాంతివ్వాలనుకుంటే దీపక్ హుడాకు జట్టులో చోటు దక్కుతుంది. చిన్న గాయమే అయితే మాత్రం కోహ్లీ కొనసాగుతాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడుతాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చేయనున్నారు.

ఆవేశ్ ఖాన్/ బిష్ణోయ్..?
అదనపు పేసరా? స్పిన్నరా? అనేదానిపై బౌలింగ్ విభాగం మార్పులు ఆధారపడి ఉన్నాయి. ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకోవాలనుకుంటే ఆవేశ్ ఖాన్ జట్టులోకి వస్తాడు. స్పిన్నర్‌ను కొనసాగించాలనుకుంటే మాత్రం రవి బిష్ణోయ్ కొనసాగుతాడు. అక్షర్ పటేల్‌ను తీసుకుంటే మాత్రం అతనికి ఉద్వాస తప్పదు. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ ఆడనున్నారు. ఏది ఏమైనా బ్యాటింగ్ మార్పులపైనే బౌలింగ్ విభాగం మార్పులు ఆధారపడి ఉన్నాయి. మరీ రోహిత్ ఏం చేస్తాడో చూడాలి.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్/దినేశ్ కార్తీక్, దీపక్ హుడా/అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్/ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజువేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












