Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL:భువీ, బుమ్రాకు రెస్ట్.. ఇషాన్ కిషన్ డౌట్! శ్రీలంకతో మూడో టీ20కి భారత తుది జట్టు ఇదే!

India Playing 11 vs Sri Lanka 3rd T20I: Jasprit Bumrah, Bhuvneshwar kumar Out and Ishan kishan Doubt

ధర్మశాల: సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. మరో నామమాత్రపు పోరుకు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లో 7 వికెట్లతో గెలుపొందిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. దాంతో ధర్మశాల వేదికగా నేడు జరగనున్న చివరి టీ20లో బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది.

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 వరల్డ్‌కప్‌నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంటుంది. ముందుగా టీమ్ కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టింది. సీనియర్ ప్లేయర్స్‌ కోహ్లీ, పంత్‌కు రెస్ట్ ఇవ్వడంతో ఫస్ట్ టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. రెండో టీ20లోనూ అదే టీమ్‌ను కొనసాగించింది.

ఇక చివరి టీ20లో బెంచ్ ఆటగాళ్లను ఆడించే అవకాశం ఉంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ తలకు గాయమైన నేపథ్యంలో అతను బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇషాన్ ఔట్.. మయాంక్‌కు చాన్స్..

ఇషాన్ ఔట్.. మయాంక్‌కు చాన్స్..

రెండో టీ20లో శ్రీలంక పేసర్ లాహిరు కుమార వేసిన రాకాసి బౌన్సర్ ఇషాన్ కిషన్ హెల్మెట్‌కు బలంగా తాకింది. అర్దరాత్రి సమయంలో గాయం తీవ్రత ఎక్కువవడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఆ తర్వాత జనరల్ వార్డ్‌కు తీసుకొచ్చి ముందస్తు వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు.

అంత తీవ్రమైన గాయం కాకపోవడంతో డిశ్చార్జ్ కూడా చేశారు. ఈ గాయం నేపథ్యంలో ఇషాన్‌కు రెస్ట్ ఇవ్వాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావించింది. దాంతో బ్యాకప్ ఓపెనర్‌గా వచ్చి మయాంక్ అగర్వాల్‌‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనున్నాడు. లేదంటే వెంకటేశ్ అయ్యర్‌‌తో ఇన్నింగ్స్ ప్రారంభించవచ్చు.

టాప్-5లో జడేజా ఫిక్స్ ..

టాప్-5లో జడేజా ఫిక్స్ ..

వరుస హాఫ్ సెంచరీలతో జోరు మీదున్న శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో సంజూ శాంసన్ ఆడనున్నాడు. రెండో టీ20లో శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బ్యాటింగ్‌లో ప్రమోషన్ అందుకున్న జడేజా టాప్5లో ఫిక్స్ అయ్యాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆరో స్థానంలో వెంకటేశ్ అయ్యర్, ఏడో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా బరిలోకి దిగనున్నాడు.

సిరాజ్, ఆవేశ్ ఖాన్‌కు చాన్స్..

సిరాజ్, ఆవేశ్ ఖాన్‌కు చాన్స్..

సీనియర్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరి ప్లేస్‌లో మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రాను కొనసాగించాలనుకుంటే మాత్రం హర్షల్ పటేల్‌ను పక్కనపెట్టవచ్చు. వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌‌కు బదులు రవిబిష్ణోయ్‌కు చోటు దక్కనుంది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై వీరు ఏ మాత్రం ప్రభావం చూపిస్తారో చూడాలి.

IND VS SL: Jadeja, Shreyas మ్యాజిక్ 2-0 Lead In Series | 11th Straight T20 Win | Oneindia Telugu
టీమిండియా తుది జట్టు (అంచనా)

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్)/ వెంకటేశ్ అయ్యర్/ మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, దీపక్ హుడా, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్.

Story first published: Sunday, February 27, 2022, 13:09 [IST]
Other articles published on Feb 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+