For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: జయంత్ ఔట్.. అక్షర్ పటేల్ ఇన్! సిరాజ్ డౌట్! లంకతో పింక్ టెస్ట్‌కు భారత తుది జట్టు ఇదే!

India Playing 11 vs Sri Lanka 2nd Test: Jayant Yadav Out and Axar Patel In

హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వరుస విజయాలు అందించిన టీమిండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మ.. టెస్ట్ ఫార్మాట్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో జడేజా ఆల్‌రౌండ్ షోతో భారత్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోరులో బెంగళూరు వేదికగా జరిగే పింక్ బాల్(డే/నైట్) సమరానికి రెడీ అవుతోంది. ఫ్లడ్ లైట్స్ మధ్య అసలు సిసలు మజాను అభిమానులకు అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గాయంతో ఫస్ట్ టెస్ట్‌కు దూరమైన స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి రావడంతో టీమ్ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. అక్షర్ రాకతో జయంత్ యాదవ్‌పై వేటు పడటం ఖాయం కాగా.. పింక్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ డేనైట్ మ్యాచ్‌లో భారత కూర్పు ఎలా ఉంటుందనేదానిపై ఓ లుక్కెద్దాం.

జయంత్ ఔట్.. సిరాజ్ డౌట్..

జయంత్ ఔట్.. సిరాజ్ డౌట్..

ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బెంగళూరు వేదికగా జరిగే రెండో మ్యాచ్ ఫ్లడ్ లైట్స్ కింద జరగుతుంది కాబట్టి ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకునే ఆలోచన చేయవచ్చు. అదే జరిగితే మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వస్తాడు. అలా కాదని ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే అక్షర్ పటేల్ రీఎంట్రీ ఇస్తాడు. అక్షర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. పైగా పింక్ బాల్‌తో ఆడటం బ్యాట్స్‌మన్‌కు సవాల్. టైమ్‌ను బట్టి ఆడాల్సి ఉంటుంది. కాబట్టి టాపార్డర్ బ్యాట్స్‌మన్‌కు ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే లోయరార్డర్‌ను బలంగా మార్చుకోవాలని ఆలోచించినా అక్షర్ ఆడటం ఖాయం.

శుభ్‌మన్ గిల్‌కు మళ్లీ నిరాశే..

శుభ్‌మన్ గిల్‌కు మళ్లీ నిరాశే..

విరాట్ కోహ్లీలా మ్యాచ్‌ మ్యాచ్‌కు మార్పులు చేసే తత్వం కెప్టెన్ రోహిత్ శర్మది కాదు. అతను విన్నింగ్ టీమ్‌నే కొనసాగించేందుకు ఇష్టపడుతాడు. కాబట్టి టాపార్డర్, మిడిలార్డర్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇదే జరిగితే గాయం నుంచి కోలుకోని రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న శుభ్‌మన్ గిల్‌కు నిరాశే ఎదురవుతుంది. ఒకవేళ ఫస్ట్ టెస్ట్‌లో విఫలమైన మయాంక్ అగర్వాల్‌ను పక్కనపెట్టాలనుకుంటే మాత్రం గిల్‌కు చోటు దక్కుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకునే సూచనలు కనిపించడం లేదు. మయాంక్ శర్మతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు.

మిడిలార్డర్ అయ్యర్, మయాంక్..

మిడిలార్డర్ అయ్యర్, మయాంక్..

సీనియర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, హనుమ విహారిలకు టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. విహారీ హాఫ్ సెంచరీతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా.. శ్రేయస్ మాత్రం విఫలమయ్యాడు. అయితే అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. పింక్ బాల్ టెస్ట్‌లో కూడా ఈ ఇద్దరే ఆడే అవకాశాలున్నాయి. మూడో స్థానంలో విహారి బ్యాటింగ్ రానుండగా.. నాలుగో స్థానంలో కోహ్లీ ఆడనున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ అంచనాలను అందుకోలేకపోయాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీతో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ తర్వాత శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే అయ్యర్ ఈ మ్యాచ్‌లో ఆడాల్సిందే.

ఆరో స్థానంలో పంత్..

ఆరో స్థానంలో పంత్..

లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ అయిన రిషభ్ పంత్ మళ్లీ ఆరో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన పంత్ 4 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. పంత్ తర్వాత రవీంద్ర జడేజా ఏడో స్థానంలో ఆడుతాడు. ఫస్ట్ టెస్ట్‌లో భారీ అజేయ శతకంతో చెలరేగిన అతను ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఎనిమిదో స్థానంలో మరో ఆల్‌రౌండర్ అశ్విన్ బరిలోకి దిగుతాడు. ఈ ఇద్దరికి అక్షర్ పటేల్ జత కలిస్తే 9వ స్థానం వరకు టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుంది. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరూ కూడా బ్యాట్ ఝులిపించగలరు. ఫస్ట్ టెస్ట్‌లో షమీ.. జడేజాతో కలిసి 100 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

తొలి టెస్ట్ భారత తుది జట్టు(అంచనా)

తొలి టెస్ట్ భారత తుది జట్టు(అంచనా)

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్ పటేల్/మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్‌ షమీ

Story first published: Friday, March 11, 2022, 10:15 [IST]
Other articles published on Mar 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+