IND vs SL:రుతురాజ్ ఇన్.. సంజూ శాంసన్ ఔట్! శ్రీలంకతో రెండో టీ20కి భారత తుది జట్టు ఇదే!

ధర్మశాల: సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో గురువారం జరిగిన ఫస్ట్ టీ20లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన రోహిత్ సేన.. శనివారం ధర్మశాల వేదికగా జరగనున్న రెండో టీ20లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకొని చివరి మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది.
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 వరల్డ్‌కప్‌నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంటుంది. ముందుగా టీమ్ కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టింది. సీనియర్ ప్లేయర్స్ కోహ్లీ, పంత్‌కు రెస్ట్ ఇవ్వడంతో పాటు గాయం నుంచి కోలుకున్న జడేజా, విశ్రాంతిని ముగించుకొని బుమ్రా అందుబాటులోకి రావడంతో టీమిండియా ఫస్ట్ టీ20లో భారీ మార్పులతో బరిలోకి దిగింది. మరీ రెండో టీ20లో అదే జట్టును కొనసాగిస్తుందా? లేక ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇస్తుందా? అనేది చూడాలి.

ఓపెనర్లుగా రోహిత్, ఇషాన్..
విన్నింగ్ కాంబినేషన్‌ను రోహిత్ సేన మార్చకపోవచ్చు. అయితే ఫిట్‌నెస్ సమస్యలతో ఫస్ట్ టీ20కి దూరమైన రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం సంజూ శాంసన్‌పై వేటు పడే అవకాశం ఉంది. అప్పుడు గైక్వాడ్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అలా కాదని సేమ్ టీమ్‌తో బరిలోకి దిగితే మాత్రం ఇషాన్ కిషనే ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. గాయంతో చివరి నిమిషంలో సూర్య తప్పుకోవడంతో అయ్యర్‌కు పోటీ లేకుండా పోయింది. వచ్చిన అవకాశాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

జడేజాకు ప్రమోషన్..
తొలి టీ20లో నాలుగో స్థానంలో సంజూ శాంసన్ రావాల్సి ఉన్నా.. ధాటిగా ఆడే సామర్థ్యం ఉన్న జడేజాను టీమ్‌మేనేజ్‌మెంట్ అప్‌ది ఆర్డర్ పంపించింది. అతని నుంచి బిగ్ హిట్స్ ఆశించింది. కానీ జడేజాకు ఎక్కువ బంతులు దొరకలేదు. భవిష్యత్తులో కూడా జడేజాను అప్‌ది ఆర్డర్ ఆడిస్తామని మ్యాచ్ అనంతరం రోహిత్ చెప్పాడు. ధనాధన్ బ్యాటింగ్ చేయాల్సినప్పుడు జడేజా ముందు వచ్చే అవకాశం ఉంది. లేకుంటే శాంసనే బరిలోకి దిగుతాడు. రుతురాజ్ జట్టులోకి వస్తే మాత్రం ఇషన్ కిషన్ నాలుగో స్థానంలో ఆడుతాడు. ఐదో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా బరిలోకి దిగనున్నాడు.

9వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్..
ఆరో స్థానంలో వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నాడు. బ్యాటింగ్ ప్రమోషన్ దొరకకుంటే ఏడో స్థానంలో రవీంద్ర జడేజా ఆడనున్నాడు. పేసర్లుగా హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ బరిలోకి దిగనుండగా.. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఆడనున్నాడు.భువీ ఆడే తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండటం టీమిండియాకు అడ్వాంటేజ్. ధర్మశాల వికెట్ పేసర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకోవాలని భావిస్తే హుడాపై వేటు పడటం ఖాయం.

టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్/సంజూ శాంసన్, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications