For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: భువీ ఔట్.. కోహ్లీ డౌట్! సౌతాఫ్రికాతో మూడో వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

 India Playing 11 vs South Africa 3rd ODI: Bhuvneshwar Kumar Out And Virat Kohli Doubt

హైదరాబాద్: సౌతాఫ్రికా గడ్డపై అడుగు పెట్టే ముందు పటిష్టంగా కనిపించిన భారత జట్టు చివరకు పేలవ ప్రదర్శనతో రెండు సిరీస్‌లూ కోల్పోయింది. టెస్టు సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న టీమిండియా మ్యాచ్ మ్యాచ్‌కు మరింత చెత్త పెర్ఫామెన్స్ కనబర్చి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌నూ చేజార్చుకుంది. కనీసం వన్డే సిరీస్‌లో మిగిలిన చివరి మ్యాచ్‌నైనా గెలిచి విజయంతో సౌతాఫ్రికా పర్యటనను ముగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం జరిగే ఆఖరి వన్డే కోసం సమయాత్తం అవుతోంది. తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన టీమిండియాలో మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

భువనేశ్వర్ ఔట్..

భువనేశ్వర్ ఔట్..

తొలి రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా 64, 67 పరుగులు ఇచ్చుకొని దారుణంగా విఫలమైన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై వేటు పడటం ఖాయం. అతని స్థానంలో యువ పేసర్ దీపక్ చాహర్ తుది జట్టులోకి రానున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి దీపక్ చాహర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. అయితే వర్క్‌లోడ్ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తే మాత్రం మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ఆడటం ఖాయం. పవర్‌ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో భారత ఆటగాళ్లు తడబడుతున్నారు. ఆ సమస్యను అధిగమించకుంటే క్లీన్ స్వీప్ అయ్యే ప్రమాదం ఉంది.

రుతురాజ్‌కు చోటిస్తే..

రుతురాజ్‌కు చోటిస్తే..

ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగడంలో మార్పు ఉండకపోవచ్చు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం శిఖర్ ధావన్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఫస్ట్ వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించి.. రెండో వన్డేలో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ ఆడటంపై కూడా అనుమానాలున్నాయి. నామమాత్రపు వన్డే నేపథ్యంలో కోహ్లీకి రెస్ట్ ఇవ్వాలని భావిస్తే అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి రావచ్చు. లేకుంటే రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన శ్రేయస్ అయ్యర్‌పై వేటు పడవచ్చు.

వెంకటేశ్ అయ్యర్ డౌట్..

వెంకటేశ్ అయ్యర్ డౌట్..

హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకువచ్చిన యువ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్.. రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బ్యాట్స్‌మన్‌గా.. బౌలర్‌గా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే మూడో వన్డేలో అతనికి చోటు ఇస్తారా? లేదా? అనేది చూడాలి. శార్దూల్ ఠాకూర్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో వెంకీ బదులు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ తీసుకోవచ్చు.

Ms Dhoni కి Loyal Fan అంటే Virat Kohli నే | Legendary Captains Emotional Bond | Oneindia Telugu
 తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్/రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్/ సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా/మహమ్మద్ సిరాజ్

Story first published: Saturday, January 22, 2022, 18:07 [IST]
Other articles published on Jan 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+