For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుజారా, శార్దూల్ ఔట్.. బుమ్రా, అశ్విన్ డౌట్! సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

India Playing 11 vs South Africa 2nd Test: Shardul Thakur, Pujara Out And Hanuma Vihari, R Ashwin Doubt

హైదరాబాద్: తొలి టెస్ట్‌ ఘనవిజయంతో సౌతాఫ్రికా గడ్డపై శుభారంభం చేసిన టీమిండియా.. రెండో టెస్ట్ కోసం సమయాత్తమవుతోంది. సఫారీ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే టార్గెట్ ఫినిష్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని వాండరర్స్ స్టేడియంలో కోహ్లీసేన వండర్ చేసేందుకు సిద్దమవుతోంది. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తూనే.. ఒకటి, రెండు మార్పులతో మరింత పకడ్బందీగా ఫైనల్ ఎలెవన్‌ను బరిలోకి దించాలని చూస్తోంది.

ముఖ్యంగా వాతావరణం, ప్రత్యర్థి టీమ్ పరిస్థితులను బట్టి..తుది జట్టును ఎంపికచేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాములుగా అయితే విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి కోహ్లీ పెద్దగా ఇష్టపడడు. కానీ సిరీస్ గెలిచి ఓ నయా చరిత్రను సృష్టించే చాన్స్ ఉండటంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్‌మేనేజ్‌మెంట్ వ్యూహాలు రచిస్తుంది.

ఓటమెరుగని టీమిండియా..

ఓటమెరుగని టీమిండియా..

సోమవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. 30 ఏళ్ల నుంచి సఫారీ గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా.. వాండరర్స్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. ఆ రికార్డును ఇప్పుడు కూడా కొనసాగించాలని కోహ్లీసేన టార్గెట్‌గా పెట్టుకుంది.

1997‌లో రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ సెంచరీ చేయడం, 2006లో సౌతాఫ్రికా ఫస్ట్ టెస్ట్ విక్టరీ ఈ మైదానంలోనే వచ్చాయి. 2018లో విరాట్ ఓవర్‌సీస్ టెస్ట్ విక్టరీ కూడా ఈ మైదానం నుంచే మొదలైంది. ఈ క్రమంలోనే అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.

పుజారా ఔట్..

పుజారా ఔట్..

ఈ మ్యాచ్‌‌కు బ్యాటింగ్ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫస్ట్ టెస్ట్‌లో సత్తా చాటడంతో వీరి స్థానాలకు వచ్చిన డోకా ఏం లేదు. కానీ గత కొన్ని రోజులుగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు చోటు దక్కడమే సందేహంగా మారింది.

ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతనికి ఇంకా అవకాశాలు ఇవ్వడం అవసరమా? అనే చర్చమొదలైంది. ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, హనుమ విహారిలకు చోటివ్వచ్చు కదా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుజారాను పక్కనపెట్టాలనుకుంటే అయ్యర్‌కు చోటు దక్కవచ్చు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడం ఇష్టం లేకపోతే పుజారాకు చివరి అవకాశం ఇస్తారు. రహానే పరిస్థితి కూడా అదే. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 48 పర్వాలేదనిపించిన రహానే.. రెండో టెస్ట్‌లో రాణించడం కీలకం.

అశ్విన్ ప్లేస్‌లో విహారికి చాన్స్..

అశ్విన్ ప్లేస్‌లో విహారికి చాన్స్..

వాండరర్స్ పిచ్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించదు. ఈ దిశగా కోహ్లీ ఆలోచిస్తే.. విహారికి ఫైనల్ ఎలెవన్‌లో చోటు దక్కొచ్చు. నలుగురు ఫ్రంట్ లైన్ పేసర్లు ఫిట్‌గా ఉంటే.. అప్పుడు స్పిన్నర్ అవసరం పెద్దగా ఉండదు. ఈ పరిస్థితుల్లో అశ్విన్‌ను తప్పించి విహారి వైపు మొగ్గుచూపుతారేమో చూడాలి. సెంచూరియన్‌లో అశ్విన్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు.

కానీ జొహన్నెస్‌బర్గ్‌కు వచ్చేసరికి స్పిన్నర్ల పాత్ర మరింత తగ్గుతుంది. గుడ్ ఓవర్ రేట్‌ను మెయింటేన్ చేయాలనుకుంటే విహారితో 8,10 ఓవర్లు వేయించొచ్చు. ఒకవేళ విహారిని తీసుకుంటే ఏడో నంబర్ వరకు భారత్ బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఇలా చేస్తే శార్దూల్‌ ఠాకూర్‌ను కూడా పక్కనపెట్టడానికి అవకాశం ఉంటుంది.

శార్దూల్ ఔట్.. ఉమెశ్ ఇన్

శార్దూల్ ఔట్.. ఉమెశ్ ఇన్

టెస్ట్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ వికెట్‌పై చాలా ఎక్కువగా గడ్డి కనిపిస్తోంది. దీంతో స్వింగ్, సీమ్ బౌలర్లకు చాలా అనుకూలమని సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి శార్దూల్‌ ప్లేస్‌లో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శార్దూల్‌తో పోలిస్తే ఉమేశ్ బౌలింగ్‌లో ఫుల్ లెంగ్త్‌తో పాటు పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది.

మాములుగా అయితే కోహ్లీ ఆల్‌రౌండర్లను ఎక్కువగా తీసుకుంటాడు. బౌలింగ్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ విధంగా చేస్తుంటాడు. అయితే ఇప్పుడు వర్క్‌లోడ్‌ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్టార్ పేసర్ బుమ్రా.. యాంకిల్ ఇంజ్యూరితో బాధపడుతున్నాడు. మరోవైపు షమీపై కూడా భారం బాగా పెరిగిపోతున్నది. కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరికి రెస్ట్ ఇచ్చి ఉమేశ్ తీసుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ బుమ్రా ఫిట్‌గా ఉంటే మాత్రం కోహ్లీ ఇవన్నీ పట్టించుకోడు.

భారత తుది జట్టు(అంచనా)

భారత తుది జట్టు(అంచనా)

కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా/శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్/హనుమ విహారి, ఉమేశ్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

Story first published: Sunday, January 2, 2022, 11:36 [IST]
Other articles published on Jan 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+