Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing 11: రహానే ఔట్.. షమీ డౌట్! సౌతాఫ్రికాతో ఫస్ట్ టెస్ట్‌ బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

India Playing 11 vs South Africa 1st Test: Ajinkya Rahane Out And Shami Doubt

హైదరాబాద్: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే మూడు టెస్ట్‌‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ సెంచూరియన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం 18 మంది ప్లేయర్లతో కూడిన జట్టును చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం ఎంపిక చేసింది. ఊహించినట్టే వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానేపై వేటు వేసి రోహిత్‌కు ఆ బాధ్యతలు ఇచ్చింది. అయితే ఫామ్ కోల్పోయినప్పటికీ రహానెతో పాటు పుజారా, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు చివరి చాన్స్‌గా టీమ్‌తో కొనసాగించింది.

హనుమ విహారి రీఎంట్రీ..

హనుమ విహారి రీఎంట్రీ..

ఇక టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు విహారిని తప్పించి విమర్శలు ఎదుర్కొన్న సెలెక్షన్ కమిటీ తిరిగి అతన్ని జట్టులోకి తీసుకుంది. అలాగే, కివీస్‌పై సత్తా చాటిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను జట్టులో కొనసాగించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌తో పాటు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న రిషభ్ పంత్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చారు. గాయాల కారణంగా స్పిన్ ఆల్‌రౌండర్స్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్, స్పిన్నర్ రాహుల్ చహర్ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. దాంతో న్యూజిలాండ్‌తో సెకండ్ టెస్ట్‌లో రాణించిన జయంత్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కింది.

టీమ్ సెలెక్షన్ హెడెక్..

టీమ్ సెలెక్షన్ హెడెక్..

18 మంది ఆటగాళ్ల నుంచి తుది జట్టును ఎంపిక చేయడం టీమ్‌మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. యువ ఆటగాళ్లకు సత్తా చాటుతుండటం.. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతుండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది టీమ్‌మేనేజ్‌మెంట్‌ తేల్చుకోలేకపోతుంది. గత పర్యటనల అనుభవం దృష్ట్యా సీనియర్లకు అవకాశం ఇవ్వాలా? లేక ఇటీవల సత్తా చాటి మంచి ఫామ్‌లో యువ ఆటగాళ్లను ఆడించాలా? అనేది హెడెక్‌గా మారింది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో సత్తాచాటిన ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. ఈ పర్యటనలో కూడా కొనసాగడం దాదాపు ఖాయం. గాయాలై తప్పుకుంటే తప్పా ఈ ఓపెనింగ్ కాంబినేషన్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

రహానే, పుజారాకు లాస్ట్ చాన్స్..

రహానే, పుజారాకు లాస్ట్ చాన్స్..

గత కొంత కాలంగా దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు ఈ సిరీస్ లాస్ట్ చాన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా అదే వైఫల్యం కొనసాగితే వారి కెరీర్‌లు దాదాపు ముగిసినట్లే. కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనకెసుకొచ్చిన కోచ్ రాహుల్ ద్రవిడ్ వినే పరిస్థితిలో లేడు. పైగా యువ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఫస్ట్ టెస్ట్‌లో రహానే, పుజారాల్లో ఒకరికే అవకాశం దక్కనుంది. పుజారా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేస్తే నాలుగో స్థానంలో కోహ్లీ రానున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అనుభవానికి ఓటేస్తే రహానేకు అవకాశం దక్కుతుంది. లేదంటే అయ్యరే తుది జట్టులో ఆడనున్నాడు. అయ్యర్‌కు అవకాశం వస్తే అతను ఐదో ప్లేస్‌లో పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నారు.

4+1 ఫార్మూలా..

4+1 ఫార్మూలా..

సౌతాఫ్రికా పిచ్‌లు పూర్తిగా పేస్‌కు అనుకూలం కాబట్టం భారత్ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలోనూ కోహ్లీసేన ఇదే ఫార్మూలాను ఉపయోగించింది. అదే జరిగితే ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగుతాడు. జట్టులో జడేజా లేడు కాబట్టి అతని ప్లేస్‌కు డోకాలేదు. నలుగురు పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు. బుమ్రా, సిరాజ్ తర్వాత బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌కే ప్రాధాన్యత దక్కనుంది. అయితే ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌ను ఆడించాలనుకుంటే మాత్రం మమహ్మద్ షమీపై వేటు పడే అవకాశం ఉంది. అప్పుడు హనుమ విహారి లేదా రహానే బరిలోకి దిగుతారు.

భారత తుది జట్టు(అంచనా)

భారత తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ/హనుమ విహారి, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

Story first published: Friday, December 10, 2021, 18:27 [IST]
Other articles published on Dec 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+