For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI vs SA: ఉమ్రాన్ మాలిక్ ఇన్.. ఆవేశ్ ఖాన్ ఔట్! రెండో టీ20 బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

 India Playing 11 vs RSA: Umran Malik Likely to replace Avesh Khan in 2nd T20 Match

కటక్: సొంతగడ్డపై టీమిండియాకు సౌతాఫ్రికా గట్టి షాకిచ్చింది. టీ20 ఫార్మాట్‌లో ఏడు నెలలుగా ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసింది. ఇక పేలవ బౌలింగ్‌తో టీమిండియా కొండంత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆదివారం కటక్ వేదికగా జరిగే రెండో టీ20కి ఇరు జట్లు సమాయాత్తం అవుతున్నాయి. ఓటమి రుచి చూపించడంతో పంత్ సేన ప్రతీకారంతో రగిలిపోతుండగా.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది. ఇక తొలి టీ20 ఓటమి నేపథ్యంలో బౌలింగ్ విభాగాన్ని మార్చే యోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంది.

ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్..

ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్..

రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్‌గా ఎంపికైన కేఎల్ రాహుల్ దురదృష్టవశాత్తు గాయంతో చివరి నిమిషంలో జట్టుకు దూరమయ్యాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్‌కు మార్గం సుగుమమైంది. తొలి టీ20లో విఫలమైనా.. అతని చోటుకు వచ్చే డోకా ఏం లేదు. ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. తొలి టీ20(36) పర్వాలేదనిపించాడు. రాహుల్ గాయంతో దూరమవడంతో కెప్టెన్సీ అందుకున్న రిషభ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. తొలి మ్యాచ్‌లో 29 పరుగులు చేసిన పంత్.. మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది.

ఫినిషర్లుగా హార్దిక్, దినేశ్ కార్తీక్..

ఫినిషర్లుగా హార్దిక్, దినేశ్ కార్తీక్..

ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీలో అదరగొట్టి టైటిల్ అందించిన గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. 12 బంతుల్లో 31 పరుగులతో అజేయంగా నిలిచి తన ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించాడు. అయితే ఆఖరి ఓవర్‌లో అతను చేసిన చిన్న తప్పిదం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న మరో ఫినిషర్, వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా హార్దిక్ విమర్శలపాలయ్యాడు. రెండో టీ20లో ఆ తప్పిదం రిపీట్ కాకపోవచ్చు.

 ఉమ్రాన్ అరంగేట్రం.. ఆవేశ్ ఖాన్ ఔట్..

ఉమ్రాన్ అరంగేట్రం.. ఆవేశ్ ఖాన్ ఔట్..

స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ తన మార్క్ చూపించలేకపోయాడు. 4 ఓవర్లు వేసి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి 40 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే రెండో టీ20లో అతని చోటుకు డోకా లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన యుజ్వేంద్ర చాహల్‌ సేవలను పంత్ పూర్తిగా వాడుకోలేదు. అతనికి కేవలం 2.1 ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. దాంతో యూజీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో తనదైన వేగంతో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడంటూ అతన్ని పక్కనపెట్టిన ద్రవిడ్.. ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని మరింత బలంగా మార్చే ప్రక్రియలో ఉమ్రాన్‌ను ఆడించనున్నారు. ఫస్ట్ టీ20లో తేలిపోయిన ఆవేశ్ ఖాన్‌పై వేటు పడనుంది. ఒక వేళ ఉమ్రాన్‌ను కాదనుకుంటే అర్షదీప్‌ను ఆడించవచ్చు. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌లు సైతం తొలి టీ20లో తేలిపోయారు.

తుది జట్టు(అంచనా):

తుది జట్టు(అంచనా):

రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్/అర్షదీప్ సింగ్

Story first published: Friday, June 10, 2022, 20:01 [IST]
Other articles published on Jun 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+